అఖిలకు వైవి సుబ్బారెడ్డి కౌంట‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-24 17:49:03

అఖిలకు వైవి సుబ్బారెడ్డి కౌంట‌ర్

నంద్యాల‌లో వ‌ర్గ పోరు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది, ఇప్ప‌టికే నంద్యాల‌లో అస‌మ్మ‌తి వ‌ర్గాలు తెలుగుదేశం పై అలాగే మంత్రి అఖిల‌ప్రియ‌పై అస‌మ్మ‌తిరాగాలు ప్ర‌ద‌ర్శిస్తున్నారు... దీంతో నంద్యాల రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతోంది.. అస‌లు నంద్యాల‌లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప‌రిస్ధితి చూస్తుంటే? వ‌చ్చే  ఎన్నిక‌ల్లో ఎటువంటి పొలిటిక‌ల్ డ్రామాలు క‌నిపిస్తాయా అని ఆలోచిస్తున్నారు నాయ‌కులు.. భూమా ఉన్నంత వ‌ర‌కూ ఆళ్ల‌గ‌డ్డ నంద్యాల రాజ‌కీయం వేరుగా ఉండేది... ఇప్ప‌డు బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి విజ‌యం సాధించినా అఖిల ప్రియ అక్క‌డ మంత్రిగా, ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా ఉన్నా వ‌ర్గ‌పోరు తారాస్ధాయికి చేరుతోంది అని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
భూమా ప్ర‌ధాన  అనుచ‌రుడు ఏవీ సుబ్బారెడ్డికి మంత్రి అఖిల‌ప్రియకు మ‌ధ్య మ‌రోసారి వార్ తెర‌మీద‌కు వ‌చ్చింది.. భూమా వర్థంతికి తనకు  పిలుపు రాలేదని మంత్రి అఖిల ప్రియ  తీరుపై సుబ్బారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.... ఆమెతో విభేదాలు వాస్తవమేనని అంగీకరించారు. ఆళ్లగడ్డలో గుంట నక్కలు ఎవరో త్వరలో తేలుస్తానని, ఈ నెల 29న తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానన్నారు. ముఖ్యమంత్రితో  తనకు సత్సంబంధాలున్నాయని ... ఏ పదవి ఇవ్వాలో త్వరలో  సీఎం నిర్ణయిస్తారని సుబ్బారెడ్డి తెలిపారు.
 
ఇక నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యం నుంచి వీరి మ‌ధ్య వార్ మ‌రింత పెరిగింది అనే చెప్పాలి....నంద్యాల ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌లిసి ప‌నిచేయాల‌ని ఏవీతో క‌లిసి న‌డ‌వాల‌ని అని తెలియ‌చేశారు అయినా అఖిల ముందుకు వెళ్లారు ఆయ‌న్ని విభేదించారు.. ఇక శిల్పా పార్టీలో కొన‌సాగిన స‌మ‌యంలో కూడా పార్టీలో వ‌ర్గ పోరు పెరిగింది దీంతో శిల్పా కూడ పార్టీ మారి వైసీపీలో చేరారు... దీంతో ఏవీ అప్ప‌టి నుంచి  త‌న పందా చూపిస్తున్నారు....ఆర్థికపరమైన విషయాల్లోనే భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. మ‌రి చూడాలి  ఈ నెల 29 న ఏవీ రూటు ఎటువైపు ఉంటుందో పార్టీలో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.