రంగంలోకి ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-24 14:50:45

రంగంలోకి ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె ?

వార‌స‌త్వ రాజ‌కీయాల్లో భాగంగాభూమా ఫ్యామిలీలో అన్న నుంచి నాగిరెడ్డి, నాగిరెడ్డి నుంచి భార్య శోభా నాగిరెడ్డి, భార్య త‌రువాత కుమార్తె అఖిల ప్రియ, అలాగే నంద్యాల ఉప ఎన్నిక‌ల‌తో భూమా నాగిరెడ్డి అన్న‌కుమారుడు భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి రంగంలోకి వ‌చ్చి ఎమ్మెల్యే అయ్యారు...
 
జిల్లాలో అతి చిన్న‌వ‌య‌సులో ఎమ్మెల్యే మంత్రి అయిన కుటుంబం కూడా ఇప్పుడు భూమా ఫ్యామిలీదే.. ఇక నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయం.. ఏవీకి ఇక్క‌డ రాజ‌కీయాల‌తో సంబంధం ఉండ‌కూడ‌ద‌ని బ‌రి గీస్తోంది మంత్రి అఖిల ప్రియ.. త‌న తండ్రికేడ‌ర్ ను మొత్తం త‌న వైపు తిప్పుకుంది.. పైగా మంత్రిగా అక్క‌డ వ్య‌వ‌హారాలు అన్ని చ‌క్క‌బెడుతోంది.
 
ఇక నాగిరెడ్డి ప్ర‌తీ విష‌యంలో త‌న మాట విని చేసేవాడ‌ని ఇప్పుడు నాగిరెడ్డి కుమార్తె అఖిల త‌న‌కు స‌రైన గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని  ఏవీ సుబ్బారెడ్డి నేరుగానే మంత్రి అఖిల పై ఫైర్ అవుతున్నారు. ఇక వీరిద్ద‌రి పంచాయ‌తీ జిల్లా నాయ‌కుల నుంచి సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళ్లింది.. ఇక కొద్ది రోజుల క్రితం వీరిద్ద‌రిని  క‌లిసి సీఎం చర్చించినా వీరి వైఖ‌రిలో ఎటువంటి మార్పురాలేదు.
 
ఇక సైకిల్ ర్యాలీలు పోటా పోటీగా మంత్రి అఖిల ప్రియ ఏవీ సుబ్బారెడ్డి చేప‌ట్టారు.. ఈ స‌మ‌యంలో ఏవీ సుబ్బారెడ్డి పై రాళ్ల‌దాడి చేశారు.. దీంతో తాను సంయ‌మ‌నంతో ఉన్నాను రెచ్చ‌గొట్ట‌ద్దు న్యాయ‌ప‌రంగా మాత్ర‌మే వెళ‌తా అంటూ ఏవీ సుబ్బారెడ్డి హెచ్చ‌రించారు.... ఇక దీనిపై పోలీసులు నిందితుల విష‌యంలో కేసును నీరుగార్చేలా చేస్తున్నారు అని ఏవీ వ‌ర్గం వాధిస్తోంది. అఖిల పై చ‌ర్య‌లు తీసుకోవాలి అని అధిష్టానానికి ఏవీ ఫిర్యాదు చేశారు..  ఈ స‌మ‌యంలో ఏవీ కుమార్తె జశ్వంతి రెడ్డి అఖిల పై ఫైర్ అయ్యారు.
 
తన తండ్రికి ఏం జరిగినా అందుకు మంత్రి అఖిలప్రియే బాధ్యత వహించాలని టీడీపీ నేత, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి రెడ్డి అన్నారు. అఖిలప్రియ తన వాహనాలపై భూమా స్టిక‍్కర్‌ తీసివేసి మంత్రి అఖిలప్రియగా స్టిక్క‌ర్లు పెట్టుకోవాలని ఆమె సూచించారు.... ఎన్నో ఏళ్లుగా మా నాన్న భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఎంతో సేవ చేశార‌ని. ర్యాలీ సందర్భంగా నాన్నపై దాడి జరగడం చాలా బాధ కలిగించింది.
 
నాన్నకు ఏదైనా జరిగింతే అఖిలక్కా నువ్వు బాధ్యత తీసుకుంటావా..? మామా మామా అంటూ మా నాన్నకు ఇచ్చే గౌరవం ఇదా..? మీడియా ముందు మాత్రం మేమంతా కలిసిపోయాం అని చెబుతావు. వెనుక మాత్రం చేయాల్సింది చేస్తున్నావ్‌. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నిస్తున్నా? నాన్న కన్నా అఖిలప్రియ 35ఏళ్లు చిన్నది. కనీసం నాన్న వయసు అయినా గౌరవం ఇవ్వడం నేర్చుకో అని జశ్వంతి రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ఏవీ కుమార్తె రంగంలోకి రావ‌డంతో అఖిల‌కు ఏవీ కుమార్తెకు పొలిటిక‌ల్ వార్ త్వ‌ర‌లోనే ఉంటుంది  అని అంటున్నారు ఆళ్ల‌గ‌డ్డ జ‌నాలు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.