ఏవీ నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-26 16:30:09

ఏవీ నిర్ణ‌యం

ఆళ్ల‌గ‌డ్డ పంచాయ‌తీ ఇప్పుడు అప్పుడే తేలేలా క‌నిపించ‌డం లేదు.... సీఎం చంద్ర‌బాబు,మంత్రి అఖిల ప్రియ‌ను ఏవీ సుబ్బారెడ్డిని ఆళ్ల‌గ‌డ్డ పంచాయ‌తీ తేల్చ‌డానికి అమ‌రావ‌తి రావాలి అని క‌బురుపంపినా, ఏవీ హాజ‌ర‌య్యారు కాని మంత్రి అఖిల‌ప్రియ మాత్రం హాజ‌రుకాలేదు.దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చ‌ర్చ‌నీయాంశ‌మైంది.. సీఎం చంద్ర‌బాబు మాట‌కు విలువలేదా అంటూ జిల్లా నాయ‌కులు కూడా ప్ర‌శ్నిస్తున్నారు.
 
సీఎం చంద్ర‌బాబు పిలిచిన విష‌యం మీడియా ముఖంగా రాష్ట్ర‌వ్యాప్తంగా తెలిస్తే మంత్రిగా ఉన్నఅఖిల‌కు తెలియ‌లేదా అంటూ సీనియ‌ర్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. ఆళ్ల‌గ‌డ్డ పంచాయ‌తీ పై ఇప్ప‌టికే మూడు సార్లు చ‌ర్చ‌లు జ‌రిగాయి... అయినా వీరి మ‌ధ్య వివాదాలు త‌గ్గ‌డం లేదు.. దీనిపై ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబు అసంతృప్తితో ఉన్నారట‌. ఇద్ద‌రూ  క‌లిసి ప‌నిచేసుకోవాలి అని చెప్పినా, ఏవీ అఖిల విష‌యంలో ఈ వివాదాల‌కు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది ఆయ‌న‌కు పెద్ద ప్ర‌శ్న‌గా మిగులుతోంది.
 
ఇక మంత్రిగా ఉండి త‌న మాట విన‌క‌పోతే ఎలా అనే ఆలోచ‌న వ‌స్తోంది... ఇటు ఏవీ కూడా, తాను భూమా ఫ్యామిలీకి 35 ఏళ్లు సేవ‌చేశా నాగిరెడ్డి త‌న‌ని ఏ నాడు వేరుగా చూడ‌లేదు... ఇప్పుడు అఖిల ఇటువంటి ప‌నులు చేస్తుంది అంటే చాలా బాధ‌గా ఉంది... త‌న పైదాడి చేయించారు.  ఇక దాడి జ‌రిగిన‌ప్పుడే తాను భూమా ఫ్యామిలిని వ‌దిలేశా.. ఇక త‌న‌కు భూమా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు అని ఏవీ సుబ్బారెడ్డి తెలియ‌చేశారు.. త‌న విధానం త‌న‌ది  మంత్రి అఖిల ప్రియ విధానం త‌నది అని అఖిల‌కు తేల్చిచెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.