య‌న‌మ‌ల‌పై అయ్య‌న్న ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

yanamala and ayyanna pathruu
Updated:  2018-09-10 12:28:11

య‌న‌మ‌ల‌పై అయ్య‌న్న ఫైర్

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల్లో మ‌రోసారి విభేదాలు ర‌చ్చ‌బండ‌కు ఎక్కాయి. తాజాగా అమ‌రావ‌తి స‌చివాలయంలో ఆర్అండ్ బీ ఆర్థిక శాఖ‌లో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో అయ్య‌న్న పాత్రుడు, ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడితో వాగ్వాదానికి దిగారు. ఆర్థిక మంత్రి హ‌యాంలో త‌మ‌కు ఎలాంటి ప‌నులు జ‌రుగ‌డంలేద‌ని తాను మంత్రిగా గా ఉండి ఏం లాభ‌మ‌ని మండిప‌డ్డారు. 
 
గ‌తంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్త‌ర‌ణ‌ కింద సుమారు 2700 కోట్ల పంపిన ప్ర‌తిపాద‌న ఈ స‌మావేశంలో లేవ‌నెత్తారు. అయితే అంత డ‌బ్బు ఇవ్వ‌లేమ‌ని య‌న‌మ‌ల స్ప‌ష్టం చేశారు. రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిస్థితి తెలిసి కూడా ఇలా అడ‌గ‌డం స‌రికాద‌ని , కొన్ని ప్ర‌తిపాద‌న‌లు పున స‌మీక్షించుకోవాల‌ని, ఉన్న నిధుల‌తోనే స‌రిపెట్టుకోవాల‌ని సూచించారు య‌న‌మ‌ల‌. 
 
ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హించిన అయ్య‌న్న, య‌న‌మ‌ల మంత్రిగా ఉన్నంత వ‌ర‌కు త‌మ‌కు ఎలాంటి మేలు జ‌రుగ‌ద‌ని భావించి స‌భ మ‌ధ్య‌లో అల‌కచెంది వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఆయ‌న‌ను ఆపేందుకు య‌న‌మ‌లు ప్ర‌య‌త్నించినా కూడా ఎవ్వ‌రిమాటను లెక్క చెయ్య‌కుండా వెల్లిన‌ట్లు తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.