మ‌రోసారి వివాదాల్లో అయ్య‌న్న పాత్రుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-10 14:52:32

మ‌రోసారి వివాదాల్లో అయ్య‌న్న పాత్రుడు

అధికార తెలుగుదేశం పార్టీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు నిత్యం పార్టీ నాయ‌కుల‌తో త‌గాదులు పెట్టుకుని అనేక సంద‌ర్భాల్లో వార్త‌ల్లో నిలిచారు. భ‌హుశా అధికార పార్టీ నాయ‌కుల్లో త‌గాదాలు ప‌డిన నాయ‌కుల్లో అయ్య‌న్న పాత్రుడే ముంద‌జ‌లో ఉంటార‌ని ప్ర‌తీ ఒక్క‌రి వాద‌న. అందుకు త‌గ్గ‌ట్టుగానే అయ్య‌న్న కూడా వ్య‌వ‌హ‌రిస్తారు.
 
అయితే తాజాగా ఆయ‌న ఖాతాలో మ‌రో వివాదం జ‌మ అయింది. ఈ సారి పార్టీ నాయ‌కుల వ్య‌వ‌హారం కాకుండా సొంతింటి వ్య‌వ‌హారం ఆయ‌న‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అయ్య‌న్న సోద‌రుడు స‌న్యాసి నాయుడు ప్ర‌స్తుతం న‌ర్సీప‌ట్నం న‌గ‌ర పంచాయితీ వైస్ చైర్మ‌న్ గా ఉన్నారు. ఆయ‌న భార్య అనిత చైర్మ‌న్ గా ప‌నిచేస్తున్నారు. సోద‌రుల మ‌ధ్య చాలా కాలంగా గ్యాప్ రావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న సోద‌రుడికి బ‌దులు త‌న కుమారుడు విజ‌య్ ని భ‌రిలోకి దించాల‌ని చూస్తున్నారు.
 
ఇక ఈ విష‌యం ఈనోటా ఆనోటా పాకి చివ‌ర‌కు స‌న్యాసి నాయుడుకి చేరింది. దీంతో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య విభేదాలు మ‌రింత ర‌గులుకున్న‌ట్లు అయింది. అంతేకాదు ఇటీవ‌లే స‌న్యాసి నాయుడు కారులో విజ‌య్ వాయిస్ రికార్డ్ పెట్టిన వ్య‌వ‌హారం పోలీస్ స్టేష‌న్ లో కేసులు పెట్టుకునే స్థాయికి చేరుకుంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య్ ని టీడీపీ త‌ర‌పున బ‌రిలోకి దించితే స‌హించేది లేదంటూ స‌న్యాసి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. 
 
నిత్యం త‌గాదాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి అయ్య‌న్న పాత్రుడు వ్య‌హారంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌ర్థి చెప్పి పంపించేవారు. కానీ ఇప్పుడు కుటుంబ త‌గాదాలు కాబ‌ట్టి అధిష్టానం కాస్త దూరంగా ఉండ‌వ‌చ్చనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఎన్నిక‌లు కూడా ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఈ వ్య‌వ‌హారం ఇలానే కొన‌సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫ‌లితాల ప్ర‌భావం చూపే ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.