ప‌వ‌న్ కు అయ్య‌న్న పాత్రుడు స్ట్రాంగ్ వార్నింగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan and ayyanna pathrudu
Updated:  2018-07-30 05:20:59

ప‌వ‌న్ కు అయ్య‌న్న పాత్రుడు స్ట్రాంగ్ వార్నింగ్

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏపీ న‌ష్టాల్లో కూరుకుపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ న‌ష్టాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పూర్తి చేసేందుకు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నార‌ని టీడీపీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు స్ప‌ష్టం చేశారు.
 
ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, మ‌రోసారి జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ వాస్త‌వాల‌ను గ‌మ‌నించ‌కుండా త‌మ నాయకుడు చంద్ర‌బాబు నాయుడు గురించి నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని అయ్య‌న్న మండిప‌డ్డారు.
 
నాలుగు సంవ‌త్స‌రాల నుంచి మోసం చేస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులను విమ‌ర్శించ‌డం మానేసి చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డం ఏంటిని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి రాష్ట్రం అభివృద్దే ల‌క్ష్యంగా చేసుకుని అహ‌ర్నిశ‌లు క‌ష్ట ప‌డుతున్నార‌ని అయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
త‌మ‌ నాయుడు చేస్తున్న అభివృద్ది చూసి ఓర్వ‌లేక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అయ్య‌న్న మండిప‌డ్డారు. ఇక నుంచి అయిన ప‌వన్ వాస్త‌వాల‌ను గ్ర‌హించి స‌భ‌ల్లో మాట్లాడాల‌ని లేక‌పోతే ఆయ‌న‌ ఇష్టం వచ్చిన‌ట్లు మాట్లాడితే ఊరుకునేది లేద‌ని అయ్య‌న్న పాత్రుడు హెచ్చ‌రించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.