గంటా పై అయ్య‌న్న ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-09 17:06:35

గంటా పై అయ్య‌న్న ఫైర్

2019 సార్వత్రిక ఎన్నిక‌ల‌కు సుమారు ఏడాది కాల వ్య‌వ‌ది ఉన్నా అప్పుడే  అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌లో వ‌ర్గ పోరు, ఆదిప‌త్య‌పోరు కొన‌సాగుతోంది... అయితే ప్ర‌తీ సారి మీడియా ముందు త‌మ‌పార్టీ ఎక్క‌డైనా కానీ క్ర‌మ‌శిక్ష‌న‌తో వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని భ‌జ‌న చేసుకునే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఇప్పుడు  టీడీపీ లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆధిప‌త్య‌పోరు కొన‌సాగుతుంటే చూస్తు ఉన్నారే త‌ప్ప వారికి స‌ర్ది చెప్పి ఆలోచ‌ల‌న చేయ‌ట్లేదు అంటున్నారు.  
 
అయితే ఇప్ప‌టికే టీడీపీ నాయ‌కులలో వ‌ర్గ‌పోరు రాయ‌ల‌సీమ‌ వ్యాప్తంగా కొన‌సాగుతోంది... రాజ‌కీయాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని జేసీ కుటుంబంలో కూడా వ‌ర్గ‌పోరు తారా స్థాయికి చేరుకుంది... తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డికి ఆయ‌న అనుచ‌రుడు ఫ‌యాజ్ కు విభేధాలు త‌లెత్తాయి.. గ‌త ఎన్నిక‌ల్లో ఫ‌యాజ్ అండ‌తో గెలిచిన జేసి ప్ర‌భార్ రెడ్డి ఆయ‌న‌ను ఇంత‌వ‌ర‌కూ గుర్తించ‌క‌పోవ‌డంతో వారి మ‌ధ్య వ‌ర్గ‌పోరు సాగుతోంది..
 
ఇక తాజాగా ఇదేబాట‌లోనే ఇద్ద‌రు టీడీపీ నాయ‌కులు న‌డుస్తున్నారు... మంత్రి గంటా శ్రీనివాస్ రావు - అయ్య‌న్న పాత్రుడి వ్య‌వ‌హారం పాత‌దే అయినా ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రు క‌మిటీ ఏర్పాటు చేయ‌డంతో వారి మ‌ధ్య మ‌రోసారి మాట‌ల యుద్దం మొద‌లైంది...మంత్రి  గంటా శ్రీనివాస్ రావు అయ్య‌న్న‌కు తెలియ‌కుండా త‌న అనుచ‌రుడితో  ఓ క‌మిటీని విశాఖ‌లో ఏర్పాటు చేశారు... అయితే ఈ క‌మిటీపై అయ్య‌న్న‌పాత్రుడు ఆగ్రహం వ్య‌క్తం చేశారు... త‌న‌కు తెలియ‌కుండా గంటా విశాఖ‌లో డీఎల్ డీఏ (జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ) క‌మిటీ ఎందుకు వేశావు అంటూ మండిప‌డ్డారు అయ్య‌న్న పాత్రుడు.
 
ఈ సంద‌ర్భంగా అయ్య‌న్న మాట్లాడుతూ..  గంటా గతాన్ని మరిచిపోయి వ్య‌వ‌హ‌రిస్తున్నారని, త‌న స్వ‌లాభం కోసం, మంత్రి ప‌ద‌వుల‌కోసం మూడుసార్లు పార్టీ మారిన నువ్వు త‌న‌కు తెలియ‌కుండా క‌మిటీ నిర్వ‌హించ‌డం ఏంట‌ని అన్నారు...కాగా  డీఎల్ డీఏ కొత్త కమిటీ నియమిస్తే తనకు అభ్యంతరం లేదు కానీ.. జిల్లాకు చెందిన ఇన్ చార్జ్ మంత్రి..ఎంపీలు.. ఎమ్మెల్యేలకు తెలియ‌కుండా నచ్చిన వారితో కమిటీ ఏర్పాటు చేయటం ఏమిటంటూ ప్రశ్నించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.