చంద్ర‌బాబును ప్ర‌జ‌లు కొడ‌తారు అయ్య‌న్న సంచ‌ల‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu ayyanna patrudu
Updated:  2018-08-23 04:44:17

చంద్ర‌బాబును ప్ర‌జ‌లు కొడ‌తారు అయ్య‌న్న సంచ‌ల‌నం

కాంగ్రెస్ తో పొత్తు అంశం ప్ర‌స్తుతం అధికార తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే అంత‌కంటే దుర్మార్గం మ‌రొక‌టి ఉండ‌ద‌ని టీడీపీ మంత్రులు మండిప‌డుతున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ముంద‌కు వెళ్లాలి అని భావిస్తుంటే టీడీపీ ఆరంభం నుంచి పార్టీలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కులు కాంగ్రెస్ తో పొత్తు ఆలోచ‌న‌పై నిప్పులు చెరుగుతున్నారు. 
 
పార్టీలో ఉన్న సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు కాంగ్రెస్ పార్టీ పొత్తు విష‌యంపై స్పందిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీని ఏపీ నుంచి అంత‌మొందించి త‌రిమి త‌రిమి కొట్టడానికి అన్న మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అటువంటి కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే రాష్ట్ర ప్ర‌జ‌లు కొడ‌తార‌ని హైచ్చ‌రించారు. 
 
ఒకవేళ‌ చంద్ర‌బాబు నాయుడు ఖ‌ర్మ‌కాలి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే అంత‌కంటే ఘోర‌మైన త‌ప్పిదం మ‌రోక‌టి ఉండ‌ద‌ని అయ్య‌న్న వ్యాఖ్య‌లు చేశారు. అయితే తాను మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తును వ్య‌తిరేకిస్తాన‌ని మంత్రి అయ్య‌న్న పాత్రుడు వ్యాఖ్యానించారు. రెండురోజుల క్రిత‌మే పార్టీ నాయ‌కుల‌తో భేటీ అయిన చంద్ర‌బాబు నాయుడు భ‌విష్య‌త్ లో కాంగ్రెస్ కు ద‌గ్గ‌ర‌య్యేలా మాట్లాడిన‌ట్లుగా నేప‌థ్యంలో అయ్య‌న్న పాత్రుడు తీవ్రంగా స్పందించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.