కార్మికులను నడిరోడ్డుపైన నిలబెట్టిన చంద్రబాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-02 12:02:52

కార్మికులను నడిరోడ్డుపైన నిలబెట్టిన చంద్రబాబు

చంద్రబాబు గత సంవత్సరం మే డే రోజున కార్మిక సోదరులకు అందరికి ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు..ఆ ఇల్లులు ఎక్కడ ఆ ఇల్లులకు కనీసం పునాదులు అయినా వేసారా అని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి ప్రశ్నించారు...
 
గత సంవత్సరం ఈ రాష్ట్రానికి నేనే మొదటి కార్మికుడిని, నాకే సన్మానం చేయాలి అని చెప్పి సన్మానం చేయించుకున్నావ్... ఒక సంవత్సరం లోపు ప్రతి కార్మికుడికి సొంత ఇల్లు కట్టిస్తానని చెప్పి, కార్మికులను మోసం చేసి నువ్వు మాత్రం ఇల్లు కట్టుకున్నావు. కార్మికులపైనా నీకు చిత్తశుద్ధి ఉందా..ఈ సంవత్సరం కాలంలో ఒక్కసారైనా వాళ్ళని తలుచుకున్నావా చంద్రబాబు అని ఎద్దేవా చేసారు శైలజ చరణ్ రెడ్డి.
 
2014 ఎన్నికలలో సుమారు 600 పైగా హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసావు, ఇప్పుడు కార్మికులను మోసం చెయ్యడం నీకు ఒక లెక్క...ఓటుకు నోటు కేసుకు భ‌యపడి కరకట్టకు పారిపోయి వచ్చినా సరే...మళ్లీ  హైదరాబాద్ లోనే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నువ్వు మాత్రం ఇల్లు కట్టుకొని, కార్మికులను నడిరోడ్డుపైన నిలబెట్టావు అని బాబుపై మండిపడ్డారు శైలజ చరణ్ రెడ్డి.
 
రైతులకు బేషరతుగా రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను మోసం చేసావు ... వ్యవసాయ రుణాలు కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకువస్తా అని చెప్పి నువ్వు సీఎం అయ్యాక తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇంటికి రాకుండా అడ్డుకున్న ఘనత నీకే ద‌క్కుతుంది చంద్ర‌బాబు అని ఆమె ప్ర‌శ్నించారు.
 
జాబు రావాలంటే బాబు రావాల‌ని అన్నావు .. కానీ బాబు పోతేనే జాబ్ వస్తుంది అంటున్నారు నిరుద్యోగులు...ఇంటికో ఉద్యోగం అన్నావు ..నీ కొడుక్కి ఉద్యోగం ఇచ్చుకున్నావు ...డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మహిళలను మోసం చేసావు , ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఎదో ఒక హామీ పేరుతో చంద్రబాబు మోసం చేసారని ఎద్దేవా చేసారు, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.