వైసీపీ అభ్య‌ర్థి ఫిక్స్ కావ‌డంతో ఆ సీటు విష‌యంలో ఎటూ తేల్చుకోలేక‌పోతున్న బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and tdp
Updated:  2018-10-23 10:41:45

వైసీపీ అభ్య‌ర్థి ఫిక్స్ కావ‌డంతో ఆ సీటు విష‌యంలో ఎటూ తేల్చుకోలేక‌పోతున్న బాబు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా మారిన జిల్లా క‌ర్నూల్ జిల్లా... ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకుగాను 2014 ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ 11 స్థానాల‌ను గెలుచుకోగా తెలుగుదేశం పార్టీ కేవ‌లం మూడు సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయింది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఈ జిల్లాలో పాగా వెయ్యాల‌నే ఉద్దేశంతో టీడీపీ అధిష్టానం వ్యూహాలు ర‌చిస్తుంది. 
 
అయితే ఈ వ్యూహాలు ఏ మాత్రం పుంజుకోలేక‌పోతున్నాయి. అలాగే రాష్ట్ర‌వ్యాప్తంగా అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి టీడీపీ తీర్థం తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఇదే ఈ జిల్లాకు చెందిన‌వారే ఉండ‌టంతో ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ‌పోరు త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇక మ‌రికొంద‌రు అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధిష్టానం త‌మ‌కే టికెట్ ఇవ్వాల‌ని భీష్మించి కూర్చున్నారు తెలుగు త‌మ్ముళ్లు. 
 
దీంతో పార్టీ పెద్ద‌లకు ఎవ‌రికి ఎలాంటి స్ప‌ష్టత ఇవ్వాలో అర్థం కాక‌ త‌ల‌పట్టేసుకుంటుంద‌ట‌. అయితే ఇదే క్ర‌మంలో వెలుగులోకి వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గం శ్రీశైలం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2014లో వైసీపీ త‌ర‌పున పోట