ఆదినారాయ‌ణ రెడ్డికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ష్ట‌మే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-11 16:19:10

ఆదినారాయ‌ణ రెడ్డికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ష్ట‌మే

గతంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ప్ర‌క‌టించిన ప్ర‌లోభాకు ఆశ‌ప‌డి సుమారు 23 మంది వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.అంతే కాదు ఈ 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల‌లో ఎవ‌రు అయితే మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమ‌ర్శిస్తారో వారికి చంద్ర‌బాబు నాయ‌డు మంత్రి ప‌ద‌వులను కూడా ఇచ్చారు.
 
ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌లకు కేవ‌లం ప‌ది నెల‌లు మాత్ర‌మే గ‌డువు ఉండ‌టంతో వారి ప‌ద‌వులు కూడా ముగియనున్నాయి. ఈ క్ర‌మంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు సీట్ల భ‌యం వ‌స్తోంద‌ట‌. ప్ర‌తీ నియోజ‌కవ‌ర్గానికి ఇద్ద‌రు టీడీపీ నాయ‌కులు ఉండ‌టంతో త‌మ‌కంటే తమ‌కు అధిష్టానం టికెట్ కేటాయించాల‌ని ఒత్తిడిని తీసుకువ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌ర్గ విభేదాలు త‌లెత్తున్నాయి..
 
అయితే ముఖ్యంగా చూస్తే క‌ప‌డ ఫిరాయింపు ఎమ్మెల్యేల ప‌రిస్థితి గోరంగా త‌యారు అవుతోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి జ‌మ్మ‌ల‌మ‌డుగు టీడీపీ ఇంచార్జ్ రామ‌సుబ్బారెడ్డి మ‌ధ్య సీట్ల గొడ‌వ కొన‌సాగుతూనే ఉంది. ఒక వైపు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి తాను ఖ‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి పోటీ చేస్తాన‌ని మీడియా స‌మావేశంలో అనేక సార్లు చెప్పారు. ఇక ఈ విష‌యంపై ఇంచార్జ్ రామ‌సుబ్బారెడ్డి స్పందిస్తూ మంత్రి చెప్పిన మాట‌ల్లో వాస్త‌వం లేద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా నేనే పోటీ చేస్తాన‌ని చెప్పారు. ఒకవేళ‌ ఆయ‌నను టీడీపీ అధిష్టానం పోటీచేయిస్తే ఆదికి వ్య‌తిరేకంగా తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.
 
అంతే కాదు జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆదినారాయ‌ణ‌రెడ్డి పోటీ చేస్తే క‌చ్చితంగా టీడీపీ ఓట‌మి చెందుతుంద‌ని ఆయ‌న తెలిపారు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా కేవ‌లం వైఎస్ కుటుంబం అండతో గెలిచారు త‌ప్ప సొంతంగా పోటీ చేస్తే ఆయ‌న‌కు డిపాజిట్లు కూడా రావ‌ని అన్నారు. ఆదినారాయ‌ణ రెడ్డి టీడీపీలోకి వ‌చ్చినా కూడా వైఎస్ కుటుంబంతో సంబందాలు ఉన్నాయ‌ని గతంలో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు రామ‌సుబ్బారెడ్డి.
 
అయితే ఇదే విష‌యంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రి ఆదినారాయణ రెడ్డిని జమ్మ‌ల‌మ‌డుగు నుంచి పోటీ చేయిస్తే క‌చ్చితంగా వ‌ర్గ విభేదాలు రావ‌డ‌మే కాకుండా ఈ ఎఫెక్ట్ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజ‌కవ‌ర్గాల‌కు చూపుతుంద‌ని భావించి ఆదినారాయ‌ణ రెడ్డిని జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి పోటీకి దించ‌ర‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.
 
పైగా ఆయ‌న పోటీ చేసేందుకు రెడిగా ఉన్నా ఆయ‌న వ‌య‌స్సు స‌హ‌కరించకుంద‌నే నేప‌థ్యంలో ఆయ‌న‌ను చంద్ర‌బాబు దూరం చేశార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఒకవేళ‌ ఆయ‌న ప‌ట్టు ప‌ట్టి ఖ‌చ్చితంగా పోటీ చేస్తాన‌ని చెబితే క‌డ‌ప ఎంపీ సీటు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ నాయ‌కులు భావిస్తున్నారు. చూడాలి మ‌రి క‌డ‌ప ఎంపీ సీటు కేటాయించ‌డంపై ఆదినారాయ‌ణ రెడ్డి ఎలా స్పందిస్తారో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.