బాబునా మజాకా చివ‌ర‌కు ఆ పార్టీని కూడా వదల్లేదు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ambati
Updated:  2018-03-20 13:20:31

బాబునా మజాకా చివ‌ర‌కు ఆ పార్టీని కూడా వదల్లేదు...

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ఈ రోజు విజ‌య‌వాడ వైసీపీ కార్యాల‌యంలో విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటు చేశారు... ఈ స‌మావేశంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... తెలుగు దేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఊస‌ర‌వెళ్లి లాగ‌ రోజుకొక రంగు పూసుకుని ఏపీ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంబ‌టి మండిప‌డ్డారు... గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తునే ఉన్నార‌ని. అధికార అండ‌తో సైకిల్ పార్టీ నాయ‌కులు విచ్చ‌ల విడిగా ప్ర‌భుత్వ సొమ్మ‌ను విదేశాకు త‌ర‌లిస్తోన్నార‌ని అంబటి అన్నారు.
 
అయితే మ‌చ్చ‌లేని త‌మ నాయ‌కుడు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రి ద్రోహి అన‌డం చాలా సిగ్గుచేట‌ని అన్నారు... అస‌లైన నంబ‌ర్ వ‌న్ ద్రోహి చంద్ర‌బాబే అని, ఇక దొంగే అవ‌త‌లి వారిని దొంగా... దొంగా అన‌డం చాలా విడ్డురంగా ఉంద‌ని మీడియా ద్వారా అన్నారు... చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మేకప్ వేసుకుని వేషాలు వేస్తుంటే, ఎటువంటి మేకప్ లేకుండా చంద్రబాబు రోజుకో వేషం వేస్తున్నారని వెళ్ల‌డించారు... పాత మిత్రులు దూరం కావడంతో కొత్త మిత్రుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని చంద్రబాబు చెబుతున్నారని తెలిపారు. ఇదంతా బాబు ఆడుతున్న నాట‌క‌మ‌ని, త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి స‌హించ‌లేక ముఖ్య‌మంత్రి ఇలాంటి కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని రాంబాబు మండిప‌డ్డారు.. 
 
2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు సుమారు ప్ర‌జ‌ల‌కు ఆరువంద‌ల‌కు పైగా హామీలు ప్ర‌క‌టించి అధికార పీఠాన్ని ద‌క్కించుకున్నార‌ని,  47 నెలు పూర్తి కావ‌స్తున్నా ఒక్క హామీ కూడా అమ‌లు చేయ‌లేద‌ని అన్నారు... బాబు చేస్తున్న ప‌రిపాల‌న‌ను ప్ర‌తీ అంశాన్ని ప్ర‌జ‌లు గమనిస్తున్నారని, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు త‌గిన బుద్ది చెబుతార‌ని అన్నారు...అలాగే ప్ర‌త్యేక హోదా విష‌యంలో వైసీపీ నేత‌లు బీజేపీతో కుమ్మ‌క్క‌య్యారు అని తెలుగు దేశం పార్టీ నాయ‌కులు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని అంబ‌టి మండిప‌డ్డారు.. తాము కేంద్రంతో కుమ్మ‌క్కు అయితే అవిశ్వాసం ఎందుకు పెడ‌తామ‌ని, ఇదంతా టీడీపీ నాయ‌కులు చేస్తున్న కుట్ర అని అన్నారు..
 
అందులో భాగంగానే తమ పార్టీ ఎంపీలు లోక్ స‌భ‌లో పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ  జరగనివ్వకుండా బీజేపీ ప్రయత్నిస్తోందని, చర్చ జరిగితే దేశ ప్రజలకు ఏపీకి జరిగిన అన్యాయం తెలుస్తుందన్నారు...ప్రత్యేక హోదా కోసం తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలతో రాజీనామా చేయిస్తామని కనిగిరి సభలో వైఎస్ జగన్ ప్రకటించారని మరోసారి అంబాటి గుర్తు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.