బాబు పార్టీ నాయ‌కుల‌తో కీల‌క భేటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-10-22 12:19:42

బాబు పార్టీ నాయ‌కుల‌తో కీల‌క భేటీ

ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌తో ఆ పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశం ముందుగా పొలిట్ బ్యూరో స‌భ్యుల‌తో స‌మావేశం అయ్యారు ఆయ‌న. కాంగ్రెస్ పార్టీతో జ‌రుగుతున్న పొత్తు చ‌ర్చ‌ల వివ‌రాల‌ను ఆ పార్టీ నేత‌లు చంద్ర‌బాబు నాయుడుకు వివ‌రించారు. 
 
ఏ ఏ స్థానాల్లో ఎవ‌రు పోటీ చేసేది... ఎన్ని స్థానాల్లో పోటీ చెయ్యాల‌నే దానిపై కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ త‌ర్వాత రాష్ట్ర క‌మిటి అధ్య‌క్షుల‌తో బాబు భేటీ కానున్నారు. అంతేకాదు టికెట్ ఆశావాహుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ కానున్నారు. ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలి అధికార టీఆర్ఎస్ నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ఎలా తిప్పికొట్టాలి వంటి అంశాల‌పై పార్టీ నేత‌లకు చంద్ర‌బాబు నాయుడు దిశా నిర్థేశం చేయ‌నున్నారు. అంతేకాదు ఈ స‌మావేశంలో ఒక కీల‌మైన విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీడీపీ నాయ‌కులు సుమారు 25 స్థానాల‌ను అడిగేందుకు సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది.
 

షేర్ :