పార్టీ నాయ‌కుల‌కు కీల‌క స‌మాచారం అందించిన బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-10-22 04:13:00

పార్టీ నాయ‌కుల‌కు కీల‌క స‌మాచారం అందించిన బాబు

తెలంగాణ‌లో ముందస్తు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు టీ-టీడీపీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామ‌నేది ముఖ్యం కాద‌ని ఎన్ని చోట్ల గెలుస్తామ‌న్న‌ది మాత్ర‌మే ముఖ్య‌మ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. 
 
సీట్ల‌పై పార్టీ నాయ‌కులు మ‌రీ ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకోకూడ‌ద‌ని అన్నారు. ముందుగా పొలిట్ బ్యూరో సభ్యుల‌తో స‌మావేశం అయిన చంద్ర‌బాబు నాయుడు ఆ త‌ర్వాత పొత్తుల వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ‌లో ప్ర‌జాకూట‌మి  అధికారంలోకి వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు తాము గెలిచే చోట్ల మాత్ర‌మే పోటీ చేస్తామని స్ప‌ష్టం చేశారు.
 
అంతేకాదు సీట్లు రాని చోట కూడా క్యాడ‌ర్ పార్టీ అభ్య‌ర్థుల విజ‌యం కోసం ప‌నిచేయాల‌ని సూచించారు. అలాగే సీట్లు రానివారికి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. పొలిట్ బ్యూరో త‌ర్వాత పార్టీ ముఖ్య‌నేత‌లు, జిల్లాల అధ్య‌క్షులు, అధికార ప్ర‌తినిధుల‌తోను ఆయ‌న స‌మావేశం అయ్యారు. అంతేకాదు టికెట్లు ఆసిస్తున్న నేత‌ల బ‌యోడెటాను చంద్ర‌బాబు స్వ‌యంగా తీసుకున్నారు. 

షేర్ :