మారని బాబు వైఖరి? మళ్ళి అదే డబ్బా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 11:15:20

మారని బాబు వైఖరి? మళ్ళి అదే డబ్బా

నలభై ఏళ్ల రాజకీయ అనుభవం నా సొంతం... దేశంలోనే నా అంత అనుభవజ్ఞుడు ఎవరు లేర‌ని అంటారు చంద్రబాబు...హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే కారణం నేనే.. మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల ఈ స్థాయికి రావడానికి కారణం నేనే, సింధుని బాడ్మింటన్ నేర్చుకోమని చెప్పింది నేనే, ఒలింపిక్స్ ని ఆంధ్రాలో జరిపిస్తా, ఇలా ఏదిపడితే అది అవసరానికి అనుగుణంగా నేనే చేశా అని చెప్పుకోవడం చంద్రబాబు నైజం.
 
ఇప్పుడు మళ్ళి చంద్రబాబు ఇదే డబ్బాని కొట్టుకోవడం మొదలుపెట్టారు..అప్పుడెప్పుడో నాకు ప్రధాని అవకాశం వచ్చింది, కానీ నా కొడుకు లోకేష్ నీ అవసరం రాష్ట్రానికి ఎంతో ఉంది చెప్తే, ప్రధాని పదవిని సైతం త్యాగం చేశా అని చాల సార్లు చెప్పారు... ఇప్పుడు చంద్రబాబు దానికి దగ్గరగా మరో కామెంట్ చేసారు...వచ్చే ఎన్నికలలో ప్రధాని ఎన్నిక మన చేతుల్లో ఉంది, 2014 ఎన్నికలలో నాలుగు సీట్లు తక్కువ వచ్చి ఉంటె నా తడాఖా చూపించేవాడిని.
 
మోడీ కంటే నేనే సీనియర్ అయినా కూడా నాకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం లేదు..తిరుపతి సభలో మోడీ ఇచ్చిన హామీల వీడియోలను ప్రదర్శిస్తాం..నన్ను ఎంత ఇబ్బందిపెట్టిన కేంద్రం మెడలు వంచి వడ్డీతో రాబడతా అని ఉండవల్లిలోని తన నివాసంలో సాధికార మిత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసారు చంద్రబాబు.
 
కానీ ప్రజలు మాత్రం మోడీ ఇచ్చిన హామీల వీడియోలు తరువాత ప్రదర్శించవచ్చు... 2014 ఎన్నికలలో నువ్వు ఇచ్చిన 600 హామీల వీడియోలను ప్రదర్శించమని కోరుతున్నారు...తెలుగు వాడివి అయ్యి ఉండి నువ్వే తెలుగు ప్రజలను మోసం చేస్తే...మోడీ మోసం చేయడం ఓ పెద్ద లెక్క...మోడీ కూడా నిన్ను చూసే మోసం చేయడం నేర్చుకున్నారు అంటున్నారు ప్రజలు...నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం తప్ప నాలుగేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని కోరుతున్నారు ప్రజలు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.