బాబును ఇబ్బందిపెడుతున్న సొంత జిల్లా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-14 11:41:39

బాబును ఇబ్బందిపెడుతున్న సొంత జిల్లా

ఏపీముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా మ‌ద‌నప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీలో రాజ‌కీయాలు నిప్పులా ర‌గులుకుంటున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కాస్తో కూస్తో ప‌ట్టున్న నియోజ‌కవ‌ర్గం అయితే టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌లు స‌మ‌యంలో ప్ర‌యోగాలు చేసిన ప్ర‌తీ సారి ఘోరంగా ఓట‌మి పాలు ఎదుర్కుంది. 
 
అధికారుల‌తో పాటు జిల్లా నాయ‌క‌త్వం కూడా త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల‌కోసం కొత్త‌ గ్రూపుల‌ను పెంచి పోషించ‌టం పార్టీని కొంప‌ముంచింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేయ‌బోయే అభ్య‌ర్థి ఎవ‌రంటే పార్టీ శ్రేనులు ఇక‌రి మొకం చూసుకునే ప‌రిస్థితి.  ఒక‌రూ ఇద్ద‌రుకాదు ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ్యాల‌ని ఆసిస్తున్న వారి సంఖ్య ప్ర‌స్తుతం ఎండంకేల‌కు చేరింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి దాదాపు 12 టీడీపీ అభ్య‌ర్థులు మాకంటే మాకు సీటు ఇవ్వాల‌ని  పోటీ ప‌డుతున్నారు. 
 
నియోజ‌క‌వ‌ర్గంలో కైన్సిల‌ర్ గా గెల‌వ‌లేని నాయ‌కుడు కూడా త‌న పేరు ప‌రిశీలించ‌మ‌ని అధినాయ‌క‌త్వానికి అభ్య‌ర్థుల‌ను పంపేదాక రావ‌డందాక మ‌ద‌న‌ప‌ల్లి టీడీపీలో ఎవ‌రిగోల వారిది అన్న‌ట్లు ఉంది. ఇక ఈ త‌ల‌నొప్పుల‌ను భ‌రించ‌లేక అధినాయ‌క‌త్వం జిల్లా బాధ్య‌త‌ల‌ను జిల్లా చెందిన ఇద్ద‌రు కీల‌న నాయ‌కుల‌కు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. ఇక వీరిద్ద‌రు ఈ సెగ్మెంట్ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకుని చివ‌రికి ముగ్గురు నాయ‌కులు సెల‌క్ట్ చేసిన‌ట్లు తెలుస్తుంది. 
 
ఇక ఈ ముగ్గురిలో ఇద్ద‌రు నాయ‌కులు మా ఇద్ద‌రిలో ఎవ‌రికి టికెట్ ఇచ్చినా ప‌ర్వాలేదు అంటుంటే మూడ‌వ వ్య‌క్తి ఖ‌చ్చితంగా త‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని భిష్మించుకుర్చున్నారు. ఇక అధిష్టానం వీరిద్దరికి ఎలాంటి స‌ల‌హల‌ను ఇస్తుందో వేచి చూడాలి. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.