బాబు మార్క్ రాజకీయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

babu political game
Updated:  2018-04-15 01:03:40

బాబు మార్క్ రాజకీయం

దటీజ్ చంద్రబాబు, ఎలాంటి సందర్భాన్ని అయినా సరే తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట...అందుకే ఆనాడు ఎన్టీఆర్ దగ్గర తన మార్క్ రాజకీయాన్ని చూపించి సీఎం పదవి అనే అందాలన్నీ ఎక్కారు...ఇలా సందర్భాన్ని బట్టి పొగడడం, తిట్టడం చేయడంలో దిట్ట.. 2004 ఎన్నికలలో బీజేపీతో పొత్తుపెట్టుకొని, ఆ ఎన్నికలలో ఓడిపోయేసరికి, ఇక జన్మలో బీజేపీతో పొత్తుపెట్టుకోము, బీజేపీతో పొత్తుపెట్టుకొని చాల పెద్ద తప్పు చేసాము...అని చెప్పారు...అలాగే గోద్రా అల్లర్ల సమయంలో మోడీని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలి, హైదరాబాద్ లో అడుగుపెడితే ఎయిర్ పోర్ట్ లోనే అరెస్ట్ చేపిస్తా అని సంచలనం వ్యాఖ్యలు చేసారు...2014 ఎన్నికలలో దేశం మొత్తం మోడీ హవా నడుస్తుండడంతో మళ్ళి బీజేపీతో కలిసి పోటీ చేసి అందలమెక్కారు...
 
బాబు ఏది చేసిన తన చతురత, తన మార్క్ రాజకీయం అందులో ఉండేటట్టు చూసుకుంటారు...ఎవరు ఏమి చేసిన తన వైపుకు తిప్పుకొని మేమె చేసాం అని డప్పుకొట్టుకుంటూ ఉంటారు..ఇప్పటికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దయతలచి, బాబుకు ఊహకు కూడా అందకుండా ఎక్కువ నిధులు ఇస్తే, ఎన్నికలు దగ్గర ఉన్నాయి కాబ్బటి శెరవేగంగా పనులు చేపించి, బీజేపీని పక్కకు తోసి ఆ క్రెడిట్ మొత్తం టీడీపీ ఖాతాలోకి వేయడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తారు బాబు...దానిని పచ్చ మీడియా ఆకాశానికి ఎత్తి బాబు సూర్యుడు, ధీరుడు, బాబు తప్ప ఎవరు చేయలేరు అని ప్రతి నోటా నానే తట్టు చేస్తాడు... 
 
అదే కేంద్రం ఎలాంటి నిధులు కేటాయించకపోతే, కేంద్రం పట్టించుకోవడంలేదు, కావాలనే ఏపీకి నిధులు కేటాయించలేదు, నా పైన కక్ష గట్టింది, అందుకే విభజన చట్టంలోని ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని బాబు రాష్ట్రం మొత్తం తెలిసేలా చెప్పి బీజేపీ పైన బురదజల్లుతాడు...దానిని పచ్చ మీడియా అయితే బాబు లేకపోతె ఈ రాష్ట్రం ఏమయిపోయివుండేదో, లోటు బడ్జెట్ ఉన్న సమర్థవంతంగా పాలిస్తున్నాడు...కేంద్రం ఎటువంటి నిధులు కేటాయించపోయిన కష్టాల్లో ఉన్న ఏపీని నెంబర్ వన్ స్థానానికి తీసుకువచ్చాడు అని ప్రతి రోజు డప్పు కొట్టి టీడీపీని అందాలన్ని ఎక్కించి, బీజేపీని తోసేస్తారు...ఇలా బీజేపీని దోషి చేసి ప్రజల ముందు నిలబెడతాడు...
 
తనకు లబ్ది చేకూరుతుంది అంటే చాలు ఎవరు ఏమయిపోయిన పర్వాలేదు దానిని తనకు అనుకూలంగా మార్చుకుని, తాను లబ్ది పొంది, వాళ్లకు చుక్కలు చూపిస్తారు అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు..చివరకు ప్రజలైన సరే అందుకే 600 హామీలు ఇచ్చి అందలమెక్కారు..తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా దారుణంగా మోసం చేసారని ప్రజలు చర్చించుకుంటున్నారు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.