చంద్ర‌బాబును ఇబ్బందిపెడుతున్న సొంత జిల్లా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-10-06 02:52:37

చంద్ర‌బాబును ఇబ్బందిపెడుతున్న సొంత జిల్లా

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా... చిత్తూరు జిల్లా పుంగ‌నూరు నియోజ‌క‌ర‌వర్గంలో మాజీ  మంత్రి ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  సీనియ‌ర్ నాయ‌కుడు పెద్దిరెడ్డి రామ‌ చంద్రారెడ్డిని ఎదుర్కునేందుకు టీడీపీ అధిష్టానం చాలా క‌స‌రత్తు చేస్తుంది. ఒకానొక‌ స‌మ‌యంలో  పుంగ‌నూరు నుంచి చినాబాబు పోటీ చేస్తార‌ని పార్టీలో ప్ర‌చారం కూడా జ‌రిగింది. టీడీపీ అవిర్భావం నుంచి పార్టీని న‌మ్ముకుంటూ వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ వెంక‌ట‌ర‌మ‌ణ‌రాజుకు ఈ జిల్లా మంత్రి చెక్ పెట్టేందుకు చిన‌బాబు పేరుని తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారని ప్ర‌చార సాగుతోంది. 
 
అంతేకాదు ప‌లుమ‌నేరులో కూడా పార్టీని న‌మ్ముకుని ఉన్న సుభాష్ చంద్ర‌బోస్ ను  కాద‌ని మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి తెర‌మీద‌కు రావ‌డంతో సుభాష్ అయ‌న వ‌ర్గాయులు గుర్రున ఉన్నార‌ట‌. ఇక టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని పోగొట్టేందుకు త‌ర్వ‌లో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న అంటూ ప్రారంభించార‌ట‌. ఈ చ‌ర్చ‌లో భాగంగా పుంగ‌నూరు నుంచి త‌న స‌తీమ‌ని రేణుకా రెడ్డి పోటీ చేస్తార‌ని మంత్రి ప్ర‌తిపాధ‌న చేశార‌ట‌. ప‌లుమ‌నేరు, పుంగ‌నూరు టికెట్లు త‌మ కుటుంబానికి కేటాయించాల‌ని కోరార‌ట మంత్రి అమ‌ర్. 
 
పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ బందువులు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో త‌మ‌కు టికెట్ ఇస్తే గెలిపించుకుంటాన‌ని హామీ ఇచ్చార‌ట‌. అయితే మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి త‌న స‌తీమ‌నికి కాకుండా ఆయ‌న మ‌ర‌ద‌లు అనుషారెడ్డికి పుంగ‌నూరు టీడీపీ అభ్య‌ర్థిగా ఎంపీక చేసిన‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది. మాజీ ఎంపీ రామ‌కృష్ణారెడ్డి ఉన్నప్ప‌టినుంచే ఇటు అమ‌ర్ నాథ్ రెడ్డి ఆయ‌న సోద‌రుడు మ‌ధ్య స‌యోధ్య‌లేక వేరువేరుగా ఉంటున్నారు. 
 
అయితే ఇదే స‌మయంలో భార్య లేక త‌న మ‌ర‌ద‌లుకు టికెట్ ఇవ్వాల‌ని మంత్రి ప‌ట్టుప‌ట్ట‌డంలో ఆంత‌ర్యం ఏమిట‌ని జ‌నం మండిప‌డుతున్నార‌ట‌. తాజాగా మంత్రి అనుషారెడ్డిపేరు ఒక్క‌సారిగా బ‌య‌టికి రావ‌డంతో పాత‌కాపులు సీరియ‌స్ గా ఉన్నార‌ట‌. ఇప్ప‌టికే టీడీపీకి బీసీలు దూరంగా ఉంటున్నార‌న్న స‌మ‌యంలో పుంగ‌నూరు టికెట్ మంత్రి త‌న కుటుంబానికి ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంపై బీసీ నేత‌లు గుర్రుగా వున్నారు.
 
 ప్ర‌తిప‌క్షం నుంచి గెలుపొంది మంత్రి ప‌ద‌వి అనుభ‌వించ‌డ‌మే కాకుండా ఆయ‌న మ‌ర‌ద‌ల‌కు కూడా టికెట్ ఇస్తున్నార‌న్న ప్ర‌చారంతో పార్టీ సీనియ‌ర్ నేత‌లు కారాలు మిర్యాలు నూరుతున్నార‌ట‌. పార్టీకోసం క‌ష్ట‌ప‌డుతున్న వారిని కాద‌ని జంపింగ్స్ కు టికెట్లు క‌ట్ట‌బెడితే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటామ‌ని హెచ్చ‌రిస్తున్నారట‌. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.