జ‌గ‌న్ కేసుల పై బాబు సంచ‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

babu sensational comments on jagan cases
Updated:  2018-03-18 10:25:26

జ‌గ‌న్ కేసుల పై బాబు సంచ‌న వ్యాఖ్య‌లు

అన్న‌వ‌స్త్రాల‌ కోసం ఆవేశ‌ప‌డితే -ఆశ‌ప‌డితే - కోరుకుంటే ఉన్న వ‌స్త్రాలు కూడా జాడ‌లేకుండా పోయాయి అని తెలుగుదేశం పార్టీ సిద్దాంతాలు మ‌రిచి నేరుగా జ‌గ‌న్ జ‌పం చేస్తోంది అని వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది.... తెలుగుదేశం ఎటువంటి విమ‌ర్శ‌లు చేసినా జ‌గ‌న్ చిరునవ్వుతో ప్ర‌జా క్షేత్రంలో తేల్చుకుంటున్నారు.. ఇక తెలుగుదేశానికి ఏపీలో ఏమి చెయ్యాలో అర్ధం కాని ప‌రిస్దితి... 2018 తెలుగుదేశానికి కాస్త ఇబ్బంది క‌లిగించిన సంవ‌త్స‌రం అని చెప్పాలి, ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, ఇద్ద‌రు మంత్రులు రాజీనామా చేయ‌డం, మ‌న‌వాడు అనుకున్న వ‌ప‌న్ ప‌క్క‌కు వెళ్లి, ఏ పార్టీతో జ‌త‌క‌ట్టాడో తెలియ‌కపొవ‌డం, త‌న ప్లీన‌రీలో మ‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలుగుదేశం కోలుకోలేని విధంగా మాన‌ని గాయంతో బాధ‌ప‌డుతోంది.
 
ఏపీకి ప్ర‌త్యేక హూదా లేదు అని జ‌నాలు బాధ‌ప‌డుతుంటే,   అసెంబ్లీ సెగ్మెంట్లు పెంచ‌లేదు అని బాబు బాధ‌ప‌డుతున్నారు.. ఇటు పార్టీలో ఉన్న నాయ‌కులు కూడా తమ‌కు సీట్లు వ‌స్తాయా లేదా అనే ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఇక జ‌గన్ జ‌గ‌న్ జ‌గ‌న్ జ‌గ‌న్ జ‌గ‌న్ జ‌గ‌న్ అనే నామంతోనే అన్ని తెలుగుదేశం కార్యాల‌యాలు మార్మోగిపోతున్నాయి. ఇటు పాద‌యాత్ర అటు ప‌వ‌న్ తిట్లు ఇటు కేంద్రం కేసుల కొరివి ఎటువైపు ఏమి ముంచుకొస్తాయో తెలియ‌ని అయోమ‌యంలో సైకిల్ పార్టీ ఉంది.
 
ఇక జ‌గ‌న్ జైలుకే అనే చంద్ర‌బాబు తాజాగా త‌న కంఠ‌స్వ‌రం మార్చారు..వైసీపీ అధినేత జగన్ కేసులను రేపోమాపో కొట్టేయబోతున్నారంటూ ఎంపీల‌కు తెలిపారు బాబు. అందుకే ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నేతలు ప్రధాని కార్యాలయంలో తిరుగుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
 
తెలుగుదేశం నాయ‌కుల‌తో టెలికాన్ప‌రెన్స్ లో ఈ విష‌యాన్ని తెలియ‌చేశారు మొత్తానికి బాబుకు ఎక్క‌డో లీకులు వ‌చ్చాయి అంటున్నారు టీడీపీ నేత‌లు.. అయితే ఇక్క‌డ జ‌గ‌న్  కేసులు కొట్టేస్తే ఓటుకు నోటు తెర‌పైకి తీసుకువ‌స్తారా అని వైసీపీ నాయ‌కులు స‌టైర్లు వేస్తున్నారు...తాము దిల్లీ వెళ్లేది ప్ర‌ధానిని క‌లిసేది  ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డానికి, అంతేకానీ ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఓటుకు నోటులు గురించి కాదు అని వైసీపీ ఎంపీలు మండిప‌డుతున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.