ఆదినారాయ‌ణ రెడ్డికి చంద్ర‌బాబు బిగ్ షాక్ కోలుకోవ‌డం క‌ష్ట‌మే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu and adi narayana reddy
Updated:  2018-10-24 06:28:59

ఆదినారాయ‌ణ రెడ్డికి చంద్ర‌బాబు బిగ్ షాక్ కోలుకోవ‌డం క‌ష్ట‌మే

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల్లో కొత్త భ‌యం పుట్టుకుంది. ఇక నుంచి స‌గం దృష్టి పార్టీ పై అంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న చేయ‌డంతో పాటు ఏ ఏ స్థానాల్లో ఎవ‌రు పోటీ చేస్తే బాగుంటుందో అధిష్టానం ప్ర‌థ‌మికంగా ఓ అంచ‌నా వేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక ఇదే త‌రుణంలో వైఎస్సార్ జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థుల‌ను  ఖ‌రారు చేసి రంగంలోకి దించాల‌ని పార్టీ అధినేత ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 
 
అయితే క్షేత్ర స్థాయిలో ప‌నితీరు మాత్రం అందుకు భిన్నంగా క‌నిపిస్తోది. క‌డ‌ప పార్ల‌మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా చోట్ల సీట్ల‌కోసం వ‌ర్గ విభేదాల‌తో అభ్య‌ర్థులు కోట్లాడుకుంటుంటే క‌డ‌ప పార్ల‌మెంట్ స్థానానికి పోటీ చేసే అభ్య‌ర్థే క‌రువు అయ్యారు. గ‌త ఎన్నిక్ల‌లో ఘోర ప‌రాజ‌యం పాలు అయిన టీడీపీ నేత‌లు ఈ సారి ఎంపీ సీటు అంటే వెన‌క‌డుగు వేస్తున్నారు. 
 
ఇక్క‌డ ఎవ్వ‌రు పోటీ చేసినా ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలియడంతో త‌మ్ముళ్లు పోటీకి జ‌గ్గుతున్నారు. 2014 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి  వైఎస్ అవినాష్ రెడ్డి సుమా