బాబుకు శ్రీకాంత్ రెడ్డి చుర‌క‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu,srikanth reddy image
Updated:  2018-03-31 05:01:37

బాబుకు శ్రీకాంత్ రెడ్డి చుర‌క‌లు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం స‌ర్కారు పై విమ‌ర్శ‌లు చేశారు..శాసనసభలో మెటల్‌ లేని అంశాలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెంటల్‌ ఎక్కిస్తున్నారని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు..ఇక ప్రజా స‌మ‌స్య‌లు చ‌ర్చించాల్సిన చోటు అసెంబ్లీ అయితే ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డంతో అధికార పార్టీ త‌న ప‌ని తాను చేసుకుపోతోంద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు... ఇక ఇన్ని రోజులు అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగాయి కాని ఒక్క ప్రజాస‌మ‌స్య కూడా అసెంబ్లీలో చ‌ర్చించ‌లేద‌ని ఆయన అన్నారు.
 
మీడియా చంద్రబాబు ప్రసంగాలను ఎక్కువగా ప్రసారం చేయకపోవడం వల్ల ఆయన శాసనసభలో డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. సొంత ప్రయోజనాలకు అసెంబ్లీని వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలను పొడిగించారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు.
 
గ‌త ఎన్నిక‌ల్లో  మేనిఫెస్టోలోని హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు..
2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఇచ్చిన హామీలు అమ‌లు చేస్తార‌ని ప్ర‌జ‌లు అంద‌రూ భావించి ఓట్లు వేస్తే చంద్ర‌బాబు రాజ‌కీయంగా నెగ్గి ప్ర‌జ‌ల‌ను నైతికంగా ఓడించారు అని వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ఆఖరి బడ్జెట్‌లోనైనా అందరికీ న్యాయం జరగుతుందని భావిస్తే.. దాన్ని నీరుగార్చరన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు శ్రీకాంత్ రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.