బాబు చివ‌రి అస్త్రం అదేన‌ట ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu image
Updated:  2018-03-28 01:07:15

బాబు చివ‌రి అస్త్రం అదేన‌ట ?

గ‌త కొన్ని రోజులుగా ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల వ‌ల్ల తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పరిపాల‌న ప‌రంగా ప‌ట్టు కోల్పోతున్నార‌ని విశ్లేష‌కులు అంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఏపీలో విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు, ప్ర‌త్యేక హోదా అంశంలో కేంద్రం అనుస‌రిస్తున్న తీరుకు నిర‌స‌న‌గా మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీని టీడీపీ వ‌దులుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి టీడీపీ-బీజేపీ ఒక‌రి పై ఒక‌రు బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేసుకుంటున్న విష‌యం కూడా తెలిసిందే.
 
చివ‌రికి ఏపీ ముఖ్య‌మంత్రి ‌చంద్రబాబు నాయుడు సైతం బీజేపీ పై విమర్శలు చేశారు. ఇటీవ‌ల బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా పై, అత‌ని కుమారుడి అవినీతి పై వ్యాఖ్యానించి చంద్ర‌బాబు సంచ‌ల‌నం రేపారు. తాజాగా టీడీపీ ఎంపీల‌తో టెలీకాన్ఫరెన్స్  నిర్వ‌హించిన చంద్ర‌బాబు, కేంద్ర ప్ర‌భుత్వం ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తే  ప్ర‌ధాని మోదీ, అమిత్ షా గురించి మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు... అందులో భాగంగానే ఎన్నడూ లేని విధంగా బీజేపీలో కొత్త కల్చర్‌ వచ్చిందని అన్నారు.  హామీలు అమలుచేయమని అడిగితే ఎదురుదాడి చేస్తారా అని బీజేపీ పై చంద్ర‌బాబు మండిప‌డ్డారు.
 
టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో రహస్య సమావేశాల పై టీడీపీ వర్గాలు చర్చించాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎవరితోనూ రహస్యంగా మంతనాలు జరపొద్దని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. దేశంలో అందరికంటే ముందు నేను సీఎం అయ్యాను. గతంలోనే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన నేతను.ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అవినీతి మచ్చ కూడా లేని నాపై కేంద్రం దాడి చేయ‌డాన్నిఆయ‌న త‌ప్పుబ‌ట్టారు.. ఇక ఫైన‌ల్ గా మోదీనే టార్గెట్ అంటూ చివ‌రి అస్త్రంగా తెలుగుదేశం అధినేత తెలుపుతున్నారు... మ‌రీ ముఖ్యంగా పార్టీ నాయ‌కులు కూడా బాబు ఫైన‌ల్ గా ఏదో అస్త్రం ప్ర‌యోగిస్తారు అంటున్నారు... మ‌రి చూడాలి బాబు అస్త్రానికి ప్ర‌తి అస్త్రంగా బీజేపీ ఎటువంటి ప్లాన్ వేస్తుందో.
 
 
     

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.