ఫిరాయింపు ఎమ్మెల్యేకు సెగ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 12:32:41

ఫిరాయింపు ఎమ్మెల్యేకు సెగ

పార్టీ మార‌నంత సేపు బాగానే ఉంది... పార్టీ మారిన తర్వాత బొగ్గుల వేడి త‌గిలి తెలియ‌కుండా నాయ‌కుల‌కు పొగ వ‌స్తోంది..... తెలుగుదేశం పార్టీ పిలిచింది అని? మంత్రి ప‌ద‌వులు కాంట్రాక్టులు ఆశించి?  వైసీపీ నుంచి తెలుగుదేశం పంచ‌న చేరారు వైసీపీ ఎమ్మెల్యేలు.
 
అయితే చంద్రబాబు క‌రివేపాకు రాజ‌కీయాలు కోస్తాలోనే కాదు, రాయ‌ల‌సీమ‌కు కూడా అల‌వాటు చేశారు అని గ‌త మూడేళ్లుగా తెలుసుకుంటున్నారు సీమ త‌మ్ముళ్లు.. పార్టీ లోకి రానంత సేపూ బుజ్జిగించి పార్టీలోకి వ‌చ్చిన త‌ర్వాత నాయ‌కుల‌ను చిన్న‌చూపు చూస్తున్నారు అనే బాధ, రాజ‌కీయ వేద‌న నాయ‌కుల చూపుల్లో - మాట‌ల్లో కనిపిస్తోంది.
 
గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఎక్కువ శాతం న‌మ్మిన వారే, జ‌గ‌న్ ను న‌మ్మించి మోసం చేశారు.. పార్టీ ఫిరాయించింది కూడా రాయ‌ల‌సీమ‌లోనే మెజార్టీ నాయ‌కులు.. అయితే ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారిలో ఎంత మందికి చంద్ర‌బాబు సీట్లు ఇస్తారో అనే డైల‌మా మాత్రం ఇంకా నాయ‌కుల్లో ఉంది.
 
తాజాగా వినిపిస్తున్న పొలిటిక‌ల్ కామెంట్లో,  ఓ రాయ‌ల‌సీమ ఫిరాయింపు ఎమ్మెల్యేకు మ‌న‌శ్శాంతి లేద‌ట‌...  నాయ‌కులు కుమ్ములాట‌ల‌తో ఆ నాయ‌కుడికి ఏటూ పాలుపోవ‌డం లేద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.... ఆ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు.. ప్రస్తుతం కడపజిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు.
 
అక్క‌డ తెలుగుదేశం త‌ర‌పున ఉన్న మాజీ ఎమ్మెల్యే విజ‌య‌మ్మ‌తో వ‌ర్గ‌పోరు ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతోంది.. ఇక పార్టీ ఫిరాయించిన త‌ర్వాత  ఈ పోరు మ‌రింత పెరిగింది.. ఇక ఎమ్మెల్యేగా జ‌య‌రాములు ఉన్నా అక్క‌డ పెత్త‌నం మాత్రం విజ‌య‌మ్మ చేతిలో ఉంది.. దీనిని ఎమ్మెల్యే జ‌య‌రాములు స‌హించ‌లేక‌పోతున్నారు. అలాగే గ‌తంలో త‌న పై పోటీ చేసి ఓడిపోయిన విజ‌య‌జ్యోతి  కూడా ...త‌మ‌కంటే త‌మ‌కు ఇక్క‌డ పెత్తనం అని ముందుకు వెళుతున్నారు.. ఇక ఈ స‌మ‌యంలో ఫిరాయించిన నాయ‌కుడిగా ఆయ‌న‌కు ముద్ర ప‌డ‌టంతో ఆయ‌నకు ఎటువంటి రాజ‌కీయ విలువ లేకుండాపోతోంది.
 
ఇక మాజీ ఎమ్మెల్యే విజ‌యమ్మ ఇక్క‌డ అభివృద్ది ప‌నులు త‌మ వ‌ర్గానికి ఇచ్చుకుంటూ ముందుకు వెళుతున్నారు.  అధికారుల‌కు ప‌నుల్లో అవినీతి జ‌రుగుతోందని - అక్రమాలు జ‌రుగుతున్నాయి అని ఎమ్మెల్యే జ‌య‌రాములు కంప్లైంట్ ఇచ్చుకోవ‌డం ఇక్క‌డ రాజ‌కీయంగా శోచ‌నీయం అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.