ఫిరాయింపు ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-21 18:17:21

ఫిరాయింపు ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం

అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌లో వ‌ర్గ‌పోరు  తారాస్థాయికి  చేరుకుంటోంది... ఏళ్ల త‌ర‌బ‌డి టీడీపీలో ఉంటూ పార్టీ కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నా కానీ త‌మ‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గుర్తించ‌డం లేద‌ని పార్టీనేత‌లు వాపోతున్నారు... సార్వ‌త్రిక ఎన్నిక‌లకు కేవ‌లం ఏడాది వ్య‌వ‌ది ఉన్న నేప‌థ్యంలో టీడీపీలో వ‌ర్గ విభేదాలు ఒక‌టి త‌ర్వాత ఒక‌టి బహిర్గ‌తం కావడంతో ప్ర‌స్తుతం చంద్ర‌బాబు డైల‌మాలో ఉన్నట్లు తెలుస్తోంది... దీంతో ఆయ‌న పార్టీ ప‌రంగా ఈ విష‌యంపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా కానీ వ్య‌తిరేక‌త ప్ర‌భావం ఎక్కువ అవుతోంద‌ని అధిష్టానం ఆలోచ‌న‌లో ప‌డింది.
 
అయితే  ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కంచుకోట అయిన అనంత‌పురం జిల్లాలో ఎన్న‌డూ లేని విధంగా ఈ ఏడాది టీడీపీ నాయ‌కుల‌లో వ‌ర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి...ప్ర‌స్తుతం తాడిప‌త్రిలో జేసి కుటుంబానికి  సీనియ‌ర్ నేత ఫ‌యాజ్ కు వివాదాలు వ‌స్తున్నాయి... వీరిద్ద‌రూ టీడీపీలో ఉన్నా కానీ ఒక‌రంటే ఒక‌రికి పొస‌గ‌డం లేదు... దీంతో అనంత‌లోని టీడీపీ ప‌రిస్థితి ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌న్న‌ట్లుగా రాజ‌కీయ వ్య‌వ‌హారం సాగుతోంది.
 
2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున జేసి దివాక‌ర్ రెడ్డి సోద‌రుడు జేసి ప్ర‌భాకర్ రెడ్డి తాడిప‌త్రిలో పోటీ చేశారు.... ఈ ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని త‌న‌ను గెలిపిస్తే ఫ‌యాజ్ కు తాడిప‌త్రిలో ఉన్న‌త‌మైన ప‌ద‌విని అప్ప‌గిస్తాన‌ని చేప్పారు ప్ర‌భాక‌ర్ రెడ్డి.... దీంతో ఆయ‌న‌ కోరిక మేర‌కు ఫ‌యాజ్ మ‌ద్ద‌తు తెలిపి జేసిని అత్య‌ధిక మెజారిటీతో గెలిచారు.. ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలుపు కీల‌క బాధ్య‌త వ‌హించిన‌ ఫ‌యాజ్ కు సుమారు నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయినా కానీ ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న‌కు ఒక్క‌ప‌ద‌వి కూడా అప్ప‌గించ‌లేదు... దీంతో త‌న‌ను జేసి చిన్న చూపు చూస్తున్నార‌నే కార‌ణంతో ఫ‌యాజ్ బ‌య‌టికివ‌చ్చారు...ఫ‌యాజ్ బ‌య‌టికి రావ‌డంతో తాడిప‌త్రిలో వ‌ర్గ‌పోరు తారా స్థాయికి చేరుకుంది.
 
ఇక తాజాగా కడప జిల్లా బద్వేల్లో కూడా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు విప‌రీతంగా పెరిగింది....బ‌ద్వేల్ నియోజ‌క వ‌ర్గం నుంచి  2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున  ఎమ్మెల్యే గా జయరాములు పోటీ చేశారు...వైసీపీ త‌ర‌పున‌ అత్య‌ధిక మెజారిటీతో గెలిచి, అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి పార్టీ ఫిరాయించారు జయరాములు...ఆ త‌ర్వాత కొద్ది కాలంపాటు టీడీపీలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా సాఫీగా పార్టీలో కొన‌సాగారు.. కానీ ఇప్పుడు ఇక్క‌డ వ‌ర్గ‌పోరు తారాస్ధాయికి చేరింది ఎంత అంటే జయరాములు స‌డ‌న్ గా టీడీపీకి రాజీనామా చేస్తాన‌ని మీడియా సాక్షిగా తెలిపారు.. ఆయ‌న‌తోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ లు క‌లిసి మూకుమ్మ‌డిగా రాజీనామా చేస్తామ‌ని తెలిపారు.
 
ఈ సంద‌ర్భంగా జ‌య‌రాములు మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీని నమ్మి టీడీపీ కండువా వేసుకుంటే, ఎస్సీ ఎమ్మెల్యే అని అగ్రవర్గాలవారు అణగదొక్కే ప్ర‌యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు... త‌న‌ను ఎమ్మెల్యేన‌ని చూడ‌కుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు...అయితే ఇప్ప‌టికైనా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారాం రావాలని, జ‌య‌రాములు డిమాండ్‌ చేశారు... లేదంటే నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లతో కలిసి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఆయన వెల్లడించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.