అక్క‌డి నుంచే పోటీ చేస్తా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-14 15:14:48

అక్క‌డి నుంచే పోటీ చేస్తా

నారా నంద‌మూరి రాజ‌కీయం క‌లిసి, ఏపీలో పాల‌న అనేలా ఉంది అయితే బాల‌య్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు ప్ర‌స్తుత సిట్టింగ్ ప్లేస్ హిందూపురం నుంచి చేస్తారా లేదా వేరే ప్రాంతం నుంచి పోటీ చేస్తారా అని అంద‌రూ ఆలోచిస్తున్నారు... ఈ స‌మ‌యంలో ఆయ‌న ఓ క్లారిటీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాలయ్య సినిమాల‌తోనే బిజిగా ఉంటార‌ని లేక‌పోతే పెన‌మ‌లూరు నుంచి పోటీ చేస్తారు అని రెండు మాటలు వినిపిస్తున్నాయి. ఈ స‌మ‌యంలో బాల‌య్య తాజాగా క్లారిటీ ఇచ్చారుఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేసేది అనేదానిపై.
 
హిందూపురం నుంచి పోటీ చేయరనే ప్రచారానికి స్వయంగా బాలయ్యే తెరదించారు. తాను హిందూపురం నుంచే పోటీ చేస్తానని బాలయ్య స్పష్టం చేశార‌ట నాయ‌కుల వద్ద‌.. అయితే దీనికి రీజ‌న్ కూడా చెబుతున్నారు... బాల‌య్య ఇక్క‌డ నాలుగేళ్లుగా అభివృద్ది చేయ‌లేదు అనే అప‌కీర్తిని మూట‌గ‌ట్టుకున్నారు..అయితే ఇక్క‌డ ఈ వ్య‌తిరేక‌త‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు... లేపాక్షి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.. రాయల కాలం నాటి దేవాలయాల అభివృద్ధికి విశేషంగా నిధులను సేకరించారు.. 50 లక్షల రూపాయలు వెచ్చించి జఠాయువును ప్రతిష్టించారు.
 
హిందూపురానికి తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి ఏర్పాటు చేయిస్తున్న ప్రత్యేక పైప్‌లైన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి... దీంతో వ‌చ్చే ఏడాది ఈ ప్రణాళికా బ‌ద్ద ప‌నులు పూర్తి చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇక త‌ర‌చూ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ నెల‌కు 10 రోజులు ఇక్క‌డ ఉండేలా ప్ర‌ణాళిక వేసుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.