అసెంబ్లీలో బాల‌య్య చుట్టూ ఎమ్మెల్యేలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

balakrishna clarity on ntr biopic
Updated:  2018-03-05 12:13:58

అసెంబ్లీలో బాల‌య్య చుట్టూ ఎమ్మెల్యేలు

హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ న‌ట‌న ప‌రంగా ఆయ‌న గురించి అంద‌రికి తెలిసిందే... ఇక రాజ‌కీయంగా ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న బాల‌య్య ఇటు సినిమాలు రాజ‌కీయాల్లో కూడా బిజీ బిజీగా ఉన్నారు.. ఇక గ‌త ఎన్నిక‌ల్లో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్‌లో బాలయ్య కుడిభుజానికి గాయమైంది. దీంతో అప్ప‌టి నుంచి ఆయన చికిత్స తీసుకుంటూ త‌న సినిమాలు కొన‌సాగిస్తున్నారు.. అయితే ఇటీవ‌ల విశ్రాంతి లేకుండా సినిమాలు చేయ‌డంతో బాల‌య్య‌కు కాస్త నొప్పి తీవ్ర‌త మ‌రింత పెరిగింది.. దీంతో ఆయన ఇటీవల హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స  చేయించుకున్నారు.
 
నేడు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కావ‌డంతో, అసెంబ్లీ స‌మావేశాల‌కు బాల‌య్య అనారోగ్యం లెక్క‌చేయ‌కుండా చేతిక‌ట్టుతోనే వ‌చ్చారు.. దీంతో బాల‌య్య‌ను చూసి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మంత్రులు ఆయ‌న్ని పరామ‌ర్శించారు.దీనికి  బాల‌య్య ఐడేంట్ కేర్ చిన్న విష‌యం  చిన్న స‌ర్జ‌రీఏ అని అంద‌రితో స‌ర‌దాగా ప‌ల‌కరించారు.
 
ఇక మ‌రో కీల‌క విష‌యం తెలియ‌చేశారు బాల‌య్య‌... ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈనెల 29న ఎన్టీఆర్‌ సినిమా ప్రారంభిస్తామన్నారు. ఈ సినిమా చేయాల‌ని సంక‌ల్పం ఉంద‌ని, త‌న‌కుఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు బాల‌య్య‌... ఎన్నికల సందర్భంగా తీసే సినిమా కాద‌ని బాలకృష్ణ చెప్పారు. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని, ఈ సినిమాకు చాలా మంది చాలాపేర్లు సూచించారని తెలిపారు. ఎన్టీఆర్‌కు మించిన పేరు లేదని భావించి ఆపేరే ఖరారు చేశామని వెల్లడించారు. ఈనెల 31, ఏప్రిల్‌ 1న లేపాక్షి  ఉత్సవాలు ఘ‌నంగా నిర్వహిస్తామని బాలకృష్ణ చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.