పవ‌న్ కు బాల‌య్య కౌంట‌ర్లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-17 18:14:28

పవ‌న్ కు బాల‌య్య కౌంట‌ర్లు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్లీన‌రీ సాక్షిగా తెలుగు దేశం అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు మంత్రి లోకేష్ పై ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే... అయితే చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై కొంత మంది సైకిల్ పార్టీ నాయకులు  స్పందించ‌క పోయినా కానీ, కొంద‌రు ఎమ్మెల్యేలు మండిప‌డ్డారు.. అలాగే  ఫిరాయింపు మంత్రి ఆదినారాయ‌ణ‌ రెడ్డి, ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డి, జ‌లీల్ ఖాన్ వంటి నాయ‌కులు ఎక్క‌డ మీడియా దొరికితే అక్క‌డ ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఫైర్ అవుతున్నారు.
 
త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబు  40 సంవ‌త్స‌రాల సుదీర్గ రాజ‌కీయ ప్ర‌యాణంలో ఎలాంటి మ‌చ్చ‌ లేని నాయ‌కుడ‌ని, అలాంటి వారిని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నిస్తే స‌హించేది లేదని మీడియాతో తెలుపుతున్నారు.
 
అయితే ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల పై హిందూపురం ఎమ్మెల్యే, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ స్పందించారు... త‌న నియెజ‌కవ‌ర్గం ప‌నిమీద శ‌నివారం అనంతపురం జిల్లాకు వ‌చ్చిన‌ ఆయ‌న మీడియాతో మాట్లాడారు... త‌మ‌ను తెలుగు ప్ర‌జ‌లు ఓట్లు వేసి గెలిపించింది ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డానికి కాద‌ని, వారికి సేవ చేసేందుక‌ని అన్నారు బాల‌కృష్ణ‌.
 
అందులో భాగంగానే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కానీ, నేను కానీ అభివృద్ది ఒక్క‌టే త‌మ లక్ష్యం అని తెలిపారు... రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప‌రిపాల‌న న‌చ్చ‌క అనేక మంది విమ‌ర్శిస్తుంటార‌ని, అలాంటి వ‌న్ని తాను ప‌ట్టించుకోన‌ని బాల‌కృష్ణ అన్నారు...ఇప్పుడు మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తాను హీరో చేయ‌ద‌ల్చుకోలేద‌ని అన్నారు... ఇప్ప‌టికైనా ఎప్ప‌టికైనా ఇటు రాజ‌కీయంలోనూ కానీ అలాగే అటు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకానీ ఎప్ప‌టికీ మేమే హీరోలం అని బాల‌కృష్ణ అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.