హిందూపురంలో త‌గ్గుతున్న బాల‌య్య గ్రాఫ్ సాక్షం ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mla balakrishna
Updated:  2018-07-17 11:22:06

హిందూపురంలో త‌గ్గుతున్న బాల‌య్య గ్రాఫ్ సాక్షం ఇదే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినే చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ఏ మాత్రం అమ‌లుకానీ ఆరువంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే క్ర‌మంలో ఆయ‌న బావ‌మ‌రిది హిందూపురం ఎమ్మెల్యే న‌టుడు బాల‌కృష్ణ కూడా హిందూపురం ప్ర‌జ‌ల‌కు బావ హామీల‌తో పాటు ఎక్స్‌ట్రా మ‌సాల‌ను యాడ్ చేసి మ‌రికొన్ని హామీల‌ను తాను ఎమ్మెల్యే అయితే చేనేత కార్మికులు 2012 లో ఎవ‌రైతే బ్యాంకులో రూణాల‌ను తీసుకున్నారో వాట‌న్నింటిన 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాఫీ చేస్తాన‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో హామీ ఇచ్చారు బాల‌య్య బాబు. 
 
కానీ టీడీపీ అధికారంలోకి వ‌చ్చి సుమారు నాలుగు సంవ‌త్స‌రాలు మూడు నెలలు పూర్తి అయినా కూడా హిందూపురం ఎమ్మెల్యే చేనేతల‌కు రుణ మాఫీ చెయ్య‌లేదు. దీంతో ఆగ్ర‌హించిన చేనేత‌లు మాకు వెంట‌నే ప్ర‌భుత్వం రుణ‌మాఫీ చెయ్యాల‌ని హిందూపురంలోని బాల‌య్య ఇంటిముందు ఫ్ల‌కాడ్స్ ప‌ట్టుకుని నిర‌స‌న‌లు చేస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు ఇష్ట‌మైన జిల్లా అనంత‌పురం జిల్లా అని ప్ర‌చారం చేసుకుంటారు త‌ప్ప ఇక్క‌డ ఎలాంటి అభివృద్ది జ‌రుగ‌డం లేద‌ని ప్ర‌జ‌లు వాపోతున్నారు. అయితే గ‌తంలో తాము త‌మ‌కు రుణ‌మాఫి కాలేద‌ని క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకువెల్లినా శూన్యం అని వారు ఆరోపిస్తున్నారు.
 
2012లో తాము బ్యాంకుల్లో అప్పు తెచ్చుకున్నామ‌ని ఆ డ‌బ్బుల‌కు వ‌డ్డీ క‌ట్టేందుకు ఒక పూట తాము త‌మ పిల్లలు ప‌స్తులు ఉండాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని చేనేత కార్మికులు గుర్తు చేశారు. ఇక ఈ లోపు 2014లో ఎన్నిక‌లు వ‌చ్చాయ‌ని ఈ ఎన్నిక‌లు ప్ర‌చారంలో బాల‌య్య తాను ఎమ్మెల్యే అయితే ఖ‌చ్చితంగా తాను రుణ మాఫి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇంత‌వ‌ర‌కు చెయ్య‌లేద‌ని వారు వాపోతున్నారు. పైగా ఆయ‌న హిందూపురం నుంచి ఎమ్మెల్యే అయినా కూడా నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న కూడా చెయ్య‌లేద‌ని చేనేత కార్మికులు వాపోతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.