ఇబ్బంది పెడుతున్న బాల‌య్య‌ పీఏ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mla balakrishna
Updated:  2018-09-25 01:03:30

ఇబ్బంది పెడుతున్న బాల‌య్య‌ పీఏ

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌కవ‌ర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయ‌కులు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌న్నంత వైరం న‌డుస్తుంది. అయితే ఈ వ‌ర్గ‌పోరును సాక్షాత్తు హిందూపురం ఎమ్మెల్యే న‌టుడు బాల‌కృష్ణ, పీఏ వీర‌య్య ప్రోత్స‌హించ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నాయ‌కులకు అంతు చిక్క‌డంలేద‌ట‌. కేవ‌లం త‌న‌కు అనుకూల వ‌ర్గం వారికి మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇస్తూ మిగిలిన వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. 
 
ఈ మేర‌కు పార్టీకి చెందిన మాజీ స‌ర్పంచ్ లు, మాజీ క‌న్వీన‌ర్లు, ఎంపీటీసీలు ప్రెస్ మీట్ పెట్టి బ‌హిరంగంగా అధికార నాయ‌కులపై విమ‌ర్శ‌లు చేశారు. కొద్దిరోజుల క్రితం బాబురెడ్డిని ప్ర‌జా ప్ర‌తినిధులంద‌రి స‌మ‌క్షంలో పార్టీ మండ‌ల క‌న్వీన‌ర్ గా ఎన్నుకున్నార‌ని కానీ బాల‌య్య పీఏ వీర‌య్య త‌న‌కు అనుకూలంగా ఉన్న రంగా రెడ్డిని క‌న్వీన‌ర్ గా ప్ర‌క‌టించుకుని నియోజ‌క‌వ‌ర్గంలో పెత్త‌నం చ‌లాయిస్తున్నార‌ని వారు మండిప‌డ్డారు. 
 
గ‌తంలో పార్టీకి ద్రోహం చేసిన వ్య‌క్తి రంగారెడ్డిని ఇప్పుడు క‌న్వీన‌ర్ గా ప్ర‌క‌టించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని వారు వాపోయారు. త‌మ గ్రామంలో అభివృద్ది విష‌యంలో వీర‌య్య‌ను అడిగితే అన్ని రంగారెడ్డి చెప్పిందే చెయ్యమంటున్నారని మండిప‌డ్డారు. అంతేకాదు ఎస్టీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కార్పోరేష‌న్ ల ద్వారా రుణాల మంజూరులోను న్యాయం చేయ‌డంలేద‌ని వారు మండిప‌డ్డారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.