బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

balakrishna and chandrababu naidu
Updated:  2018-04-20 05:21:36

బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సీఎం చంద్ర‌బాబు నాయుడు నేడు చేస్తున్నదానిని ధ‌ర్మ‌పోరాట దీక్ష అని తెలుగుదేశం నాయ‌కులు  అంటుంటే కాదు ఇది 12 గంట‌ల ఉప‌వాసం అని కొన్ని పార్టీల నేత‌లు అంటున్నారు...ఈ పోరాట దీక్ష పై ఇప్ప‌టికే ప‌లు పార్టీల నుంచి విమ‌ర్శ‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే.. ఇక ఈ ధ‌ర్మ పోరాటం వ‌ల్ల ఎవ‌రికి లాభం అనేది తెలియ‌డం లేదు అని బీజేపీ విమ‌ర్శ‌లు చేస్తోంది..
 
ఇక ఈ దీక్ష‌లో మాట్లాడిన ప‌లువురు నాయ‌కులు ఏపీకి జ‌రిగిన అన్యాయం గురించి ప్ర‌స్తావిస్తే, ఎమ్మెల్యే న‌టుడు ఎన్టీఆర్ కుమారుడు బాల‌కృష్ణ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పై విమ‌ర్శ‌లు చేశారు.. ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇప్పుడు బీజేపీ నాయ‌కులు దీనిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
మోదీని శిఖండి అని, తరిమితరిమి కొడతామని అన్నారు బాల‌య్య . వేదికపైనున్న చంద్రబాబు ముసిముసిగా నవ్వుతూ బావమరిది వ్యాఖ్యలను స్వాగతించారు.. దీంతో బాల‌య్య వ్యాఖ్య‌ల‌ను బీజేపీ ఖండించింది..
అలాగే బాల‌య్య మ‌రింత విరుచుకుప‌డ్డారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పై ....నువ్వొక ద్రోహివి.. తరిమికొడతాం..: సామదానబేధదండోపాయాలు అంటారుకదా.. ఇప్పుడు చివరి దశలో ఉన్నాం. మోసం చేసిన మోదీని తరిమితరిమి కొట్టాలి. ఒక్క ఏపీలోనేకాదు దేశమంతటా ఆయనపై వ్యతిరేకత ఉంది. మోదీ.. నీకు తెలుగువాళ్ల ఘోష వినిపించట్లేదా? అన్నారు.
 
ఇక తెలుగు అర్ధం కాక‌పోతే తెలుగు నేర్చుకో  దానితోపాటు పెద్దల్ని గౌరవించడం నేర్చుకో. అన్నింటికన్నా ముఖ్యంగా నీ భార్యను ప్రేమించడం తెలుసుకో. నీకు బాకా ఊదేవాళ్ల మాటలు వినకు. ఏపీకి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి. నిన్ను కొట్టి కొట్టి తరుముతాం, బంకర్‌లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతాం. ఒకప్పుడు నీ బీజేపీకి రెండు సీట్లు కూడా లేవు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానెయ్‌. ఎవరెవరినో అడ్డం అడ్డంపెట్టుకుని వ్యవహారాలు సాగిస్తున్నశిఖండివి నువ్వు అని బాలకృష్ణ అన్నారు.
 
రాజధాని శంకుస్థాపనకు మోదీ మట్టి, పవిత్ర జలాలను తేవడాన్ని గుర్తుచేస్తూ..  ఏం మా దగ్గరలేవా మట్టి, నీళ్లూ?’ అని ప్రశ్నించారు. ఏపీ పౌరుడు ఒక్కొక్కరు ఒక గౌతమీపుత్ర శాతకర్ణిలా మారి బీజేపీపై, మోదీపై పోరాటం చేయాలని బాలయ్య పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు బాల‌య్య పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మోదీపై విమ‌ర్శ‌లు చేసినందుకు, ఆయ‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని బీజేపీ ప్ర‌శ్నిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.