బాల‌య్య అల్లుడు పోటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-12 17:32:11

బాల‌య్య అల్లుడు పోటీ

వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్ల కోసం ఇప్ప‌టి నుంచే పార్టీల్లో ఉన్న నాయ‌కులు, బ‌య‌ట ఉన్న ఆశావాదులు సీట్ల కోసం రెడీ అవుతున్నారు. త‌మ అదృష్టం ప‌రీక్షించుకోవ‌డానికి సిద్దం అవుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఎక్కువగా ఇటు వైసీపీ అటు తెలుగుదేశం నుంచి వార‌సులు పోటీ చేసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది అని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌తీ జిల్లాలో తెలుగుదేశం పార్టి నుంచి వార‌సులు ముగ్గురు రెడీగా ఉన్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం యువ‌త‌కు సీట్లు ఇచ్చే ఆలోచ‌న‌లో ఉంది అని తెలుస్తోంది.
 
ఇక వైసీపీ కూడా యువ నాయ‌కుల‌కు సీట్లు ఇచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం 2019 వ‌చ్చే ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానంలో ఆసక్తికరమైన పోటీ ఉంటుంది అని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ ఎంపీగా వైసీపీ త‌ర‌పున వైయ‌స్ జ‌గ‌న్ మాతృమూర్తి వైయ‌స్ విజ‌య‌మ్మ నిల‌బ‌డ్డారు. ఇటు బీజేపీ త‌ర‌పున హ‌రిబాబు నిల్చొని విజ‌యం సాధించారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ బీజేపీ తెలుగుదేశం క‌లిసి పోటీ చేసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో, ఇక్క‌డ తెలుగుదేశం త‌ర‌పున బాల‌కృష్ణ అల్లుడిని రంగంలోకి దించాల‌ని భావిస్తున్నార‌ట‌.
 
2019  ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానానికి నటుడు బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్‌ పేరు ఖరారు అయిన‌ట్టు తెలుస్తోంది. లోకేష్‌ తోడల్లుడైన భరత్‌ కుటుంబం ఆర్థికంగా బలంగానే ఉంది. ఇక ఇక్క‌డ ఆయ‌న నిల‌బ‌డితే తెలుగుదేశం విజ‌యం ప‌క్కాగా ఉంటుంది అని భావిస్తున్నార‌ట‌.. ఇక ఆయ‌న గీతం వర్శిటీకి ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్రాలో పేరు ఉండ‌టంతో భ‌ర‌త్ కు ఇక్క‌డ ఎంపీ సీటు ఇవ్వాలి అని లోకేష్ కూడా భావిస్తున్నార‌ట . మ‌రి దీనిపై సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం ఫైన‌ల్ అని అంటున్నారు నాయ‌కులు. మరి చూడాలి ఇటు వైసీపీ, బీజేపీ, తెలుగుదేశం, జ‌న‌సేన, కాంగ్రెస్ ఐదు పార్టీల మ‌ధ్య పోటీ ఎలా ఉండ‌బోతోందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.