రాజ‌కీయాల్లో కి బాలయ్య చిన్న‌ల్లుడు అక్క‌డి నుంచే పోటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-02 18:05:57

రాజ‌కీయాల్లో కి బాలయ్య చిన్న‌ల్లుడు అక్క‌డి నుంచే పోటీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. అందులో ముఖ్యంగా వార‌స‌త్వ రాజ‌కీయాలు ఎక్క‌వ అవుతున్నాయి. ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మిన‌హాయిస్తే అధికార తెలుగుదేశం పార్టీలో 2019కి వారస‌త్వ రాజ‌కీయాలు ఎక్కువ అవుతాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే టీడీపీ మంత్రి  ప‌రిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తున్నారు.
 
ఈ జిల్లాలో 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండ‌టంతో శ్రీరామ్ పోటీ చేయ‌డం క‌ష్టంగా మారుతోంది. ఇక చేసేది ఏమిలేక వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సునీత త‌న సీటును త‌న కూమారుడికి త్యాగం చేస్తార‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఇదే క్ర‌మంలో టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా త‌న కుమారుడు ప‌వ‌న్ రెడ్డిని కూడా రాజ‌కీయ అరంగేట్రం చేయించనున్నారు. అయితే ప‌వ‌న్ కు అసెంబ్లీ సీటు ఇవ్వ‌డం చాలా కష్టంగా మారుతోంది. ఎందుకంటే ఆయ‌న కోసం సీటును త్యాగం చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిద్దంగా లేరు. అందుకే జేసీ త‌న రాజీకీయ అనుభ‌వాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై ప్ర‌యోగిస్తున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇదే క్ర‌మంలో విశాఖ‌లో కీల‌క నాయ‌కుడిగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా త‌న కుమారుడు జ‌య‌దేవ్ ను రాజ‌కీయ‌ అరంగేట్రం చేయిచేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతేకాదు త‌న‌కుమారుడికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ‌లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున సీటు ఇవ్వాల‌ని అధిష్టానాన్ని కోరిన‌ట్టు స‌మాచారం. అయితే ఇందుకు అధిష్టానం కూడా సుముఖంగా ఉంది. కానీ ఇంత‌లో విశాఖ‌లో పెద్ద పిడుగు ప‌డిన‌ట్లు ఒక సంచ‌ల‌న వార్త వెలుగులోకి వ‌చ్చి గంటాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంద‌ట‌.
 
ఆ వార్త ఏంటంటే హిందూపురం ఎమ్మెల్యే న‌టుడు బాల‌కృష్ణ చిన్న కుమార్తె భ‌ర్త కూడా రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం చేస్తే గంటా శ్రీనివాస రావు ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ప్ర‌తి ఒక్క‌రి ప్ర‌శ్న‌. తాజా విస్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బాలకృష్ణ చిన్న అల్లుడుని విశాఖ ప‌ట్నంలో టీడీపీ త‌ర‌పున పోటీ చేయించేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
వాస్త‌వానికి విశాఖ‌ టికెట్ ను గీతం విద్యాసంస్థ అధినేత ఎంవీవీఎస్ మూర్తి ఆశించారు. టీడీపీ అధిష్టానం త‌న‌కు సీటు కేటాయించ‌క‌పోతే త‌న మ‌నువ‌డు భరత్ కు సీటు ఇవ్వాల‌ని ఆయ‌న అధిష్టానాన్ని కోరార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సీటు బాల‌య్య చిన్న అల్లుడుకి ఇచ్చేందుకు సిద్ద‌య్యార‌ని తెలుస్తోంది. వ‌చ్చేఎన్నిక‌ల్లో గంటా శ్రీనివాస్ ను అసెంబ్లీకి కాకుండా పార్ల‌మెంట్ ప‌రిధిలో పోటీ చేయించేందుకు పార్టీ అధిష్టానం సిద్ద‌మైంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ విష‌యంపై గంటా స్పందించాల్సి ఉంటుంది. కాగా 2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డంతో ఆ సీటు బీజేపీ అభ్య‌ర్థి  హరిబాబుకు ద‌క్కింది. ఇక ఆ ఎన్నిక‌ల్లో వైఎస్ విజ‌యమ్మ‌పై హరిబాబు స్వ‌ల్ప మెజారిటీతో గెలిచారు.
 
ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడు కేంద్రానికి క‌టీఫ్ చెప్ప‌డంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. ఇక ఆ స్థానాన్ని బాలయ్య‌బాబు చిన్న అల్లుడుని పోటీ చేయించాల‌ని చూస్తున్నార‌ట‌. అయితే అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌న‌ రాలేదు. అయితే ఇప్ప‌టికి బాల‌కృష్ణ పెద్ద అల్లుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారాలోకేశ్ రాజ‌కీయ అరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.