బాల‌య్య సీటు మార‌నుంది ఇది ప‌క్కా ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

balakrishna hindupuram mla
Updated:  2018-04-02 03:52:31

బాల‌య్య సీటు మార‌నుంది ఇది ప‌క్కా ?

తెలుగుదేశం పార్టీ నాయ‌కులు సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో వారి వ్య‌వ‌హార శైలిలో పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు జ‌రుగుతున్నాయ‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు... అయితే ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ‌లో టీడీపీ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకొని పార్టీ మారే యోచ‌లో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది... దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వారికి ప్ర‌త్య‌క్షంగా అపాయింట్ మెంట్ ఇచ్చి అమ‌రావ‌తికి ర‌ప్పించుకుని వారిని బుజ్జ‌గించే ప‌నినిలో నిమ‌గ్న‌మ‌య్యార‌ని విశ్లేష‌కుల తెలుపుతున్నారు.
 
అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఇదే బాట‌లోనే చంద్ర‌బాబు బావమ‌రిది న‌టుడు,హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఉన్నార‌ని ప్ర‌ముఖ జాతీయ ప‌త్రిక ఒక క‌థ‌నంలో పేర్కొంది... ఈ క‌థ‌నం ప్ర‌కారం చూస్తే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో హిందూపురం నుంచి బాల‌కృష్ణ పోటీ చేయ‌క‌పోవ‌చ్చ‌ని పేర్కొంది.. బాల‌కృష్ణ‌కు  బ‌దులుగా ఆయ‌న అల్లుడు నారా లోకేష్ హిందుపురం నుంచి పోటీ చేయాల‌ని ఆలోచిస్తున్నార‌ట... ఇందుకోసం చంద్ర‌బాబు అన్ని విధాలుగా స‌ర్వం సిద్దం చేసిన‌ట్లు తెలుస్తోంది. 
 
2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున అత్య‌ధిక మెజారిటీతో గెలిచిన బాల‌య్య అధికారంలో ఉండి కూడా ఇంత‌వ‌ర‌కూ హిందూపురంలో ఒక్క అభివృద్ది కార్య‌క్ర‌మం కూడా చేప‌ట్ట‌లేదు... వేస‌వి కాలం వ‌చ్చిందంటే అక్క‌డ  ప్ర‌జ‌ల‌కు నీటి స‌మ‌స్య ఎక్కువ‌గా వుంటోంది.. ఈ స‌మ‌స్య రోజు రోజుకూ పెరిగి పోవ‌డంతో బాల‌య్య‌పై వ్య‌తిరేక‌తత‌ మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది... ఈ స‌మ‌యంలో హిందూపురం నుంచి టీడీపీ త‌ర‌పున బాల‌య్య‌ను పోటీ చేయిస్తే ఓట‌మి పాలుఅవ‌డం ఖాయం అని భావించి ముఖ్య‌మంత్రి త‌న కుమారుడు లోకేష్ ను మంత్రిగా ఉన్నారు కాబ‌ట్టి ఇక్క‌డ నుంచి పోటీకి దింపాలి అని చూస్తున్నారు...
 
అయితే ఇక్క‌డ వైసీపీ త‌ర‌పున కూడా గ‌ట్టి నాయ‌కుడు ఉండ‌టం ఇప్ప‌టికే సెగ్మెంట్లో తెలుగుదేశం పై విమ‌ర్శ‌లు రావ‌డం తెలిసిందే... ఇక వైసీపీ ఇంచార్జ్ న‌వీన్ నిశ్చ‌ల్  ఇక్క‌డ బాగానే పార్టీ త‌ర‌పున క‌ష్ట‌ప‌డుతున్నారు.. గత ఎన్నిక‌ల్లో ఓట‌మితో వైసీపీ 2014 నుంచి ఇక్క‌డ బాగానే ఫోక‌స్ చేసింది.. బాల‌య్య ఎమ్మెల్యేగా ఇక్క‌డ ఎటువంటి అభివృద్ది చేయ‌లేదు అనేది ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లింది.
 
దీంతో ఇక్క‌డ నారాలోకేష్ కు సీటు ఇచ్చినా తాత సీటు కాబ‌ట్టి తెలుగుదేశం మ‌ళ్లీ ఇక్క‌డ నారాలోకేష్ తో విజ‌యం చేప‌ట్టాలని భావిస్తోంది... మ‌రి చూడాలి బాల‌య్య సొంత జిల్లా కృష్ణాలో పోటీ చేస్తారు అని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రో ప‌క్క సినిమాలు ఫుట్ టైమ్  చేయాలి అని బాల‌య్య డిసైడ్ అయ్యారు అని అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.