వైసీపీలోకి ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-28 17:17:22

వైసీపీలోకి ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్యే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకి ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర పెద్ద స‌మ‌స్య‌గా మారుతుందా! అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.
 
ఎందుకంటే గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌ను చూసి టీడీపీ నాయ‌కులంద‌రూ కేవ‌లం ఈ యాత్ర రాయ‌ల‌సీయ‌కు మాత్ర‌మే పరిమితం అవుతుంద‌ని భావించారు.ఇక ఇదే విష‌యాన్నిచంద్ర‌బాబు కూడా అన్నారు. కానీ ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో పాయాత్ర చేస్తున్న జ‌న‌నేత జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు తెలిపేందుకు ప్ర‌జ‌లు తండోప తండాలుగా క‌ద‌లి వ‌స్తున్నారు.
 
జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి ప్ర‌స్తుతం టీడీపీ నాయ‌కులంద‌రు డైల‌మాలో ప‌డ్డారు. ఇక మ‌రి కొంద‌రు సీనియ‌ర్ టీడీపీ నాయ‌కులు అయితే జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.  ఇక ఇదే క్ర‌మంలో  ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. 
 
ఇంత‌కూ ఎవ‌రా ఎమ్మెల్యే అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారా! బ‌న‌గాన‌ప‌ల్లికు చెందిన బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి గ‌త కొద్ది కాలంగా టీడీపీకి దూరంటా ఉంటూ వ‌స్తున్నారు. తాను పార్టీ త‌ర‌పున 2014 లో పోటీ చేసి గెలిచినా కూడా చంద్ర‌బాబు ఎలాంటి గుర్తింపు ఇవ్వ‌డంలేద‌ని ఆరోపిస్తున్నారు. అందుకే తాను ఈ నియోజ‌కవ‌ర్గంలో మినీ మ‌హానాడు స‌భ‌ను నిర్వ‌హించ‌లేదని అన్నారు. 1983 నుంచి టీడీపీకి కంచుకోట‌గా వ‌స్తున్న ఆ జిల్లాలో మినీ మ‌హానాడు స‌భ‌ను నిర్వ‌హించ‌కపోవ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌లనంగా మారిని సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా చంద్ర‌బాబు ఆద్వ‌ర్యంలో బ‌న‌గాన‌ప‌ల్లిలో జ‌రిగిని మినీ మ‌హానాడు స‌భ‌కు బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి హాజ‌రు కాలేదు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఫోన్ చేసి ఎందుకు స‌భ‌కు హాజ‌రు కాలేద‌ని అడిగితే త‌న‌కు మహానాడుకు రావడానికి ఇష్టంలేద‌ని తాను పార్టీని వీడడం ఖాయం అని తేల్చిచెప్పారు.
 
2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తనను, తన నియోజకవర్గాన్ని మీరు పట్టించుకోలేద‌ని తాను జనంలోకి వెళ్ళాలంటే కూడా భయపడేలా చేశారని తెలిపారు. అందుకే త‌న‌కు టీడీపీలో ఉండడం ఇష్టం లేదని బాబుతోనే చెప్పేశారు జనార్థన్ రెడ్డి. ఎన్నికలకు ఏడాది కాలం ఉన్న నేప‌థ్యంలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే, పార్టీని వీడిపోతే ఆ ప్రభావం పార్టీపై బలంగా పడుతుందని భయపడ్డ చంద్రబాబు టీడీపీ  సీనియర్ నేతలందరినీ మహానాడులోనే తిట్టిపోశారు. 
 
ఈ సంద‌ర్భంగా వారికి సల‌హా ఇస్తూ జనార్థన్ రెడ్డిని ఒప్పించి తర్వాత రెండు రోజులకు అయినా మహానాడుకు వచ్చేలా చేయాలని, అవసరమైతే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని ఇచ్చేలా చేస్తాన‌ని చంద్ర‌బాబు అన్నార‌ట‌. మ‌రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన ఆఫ‌ర్ కు జ‌నార్థ‌న్ రెడ్డి లొంగిపోతారా, లేక బ‌న‌గాన‌ప‌ల్లి అభివృద్దిని చూసి, జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌తారా అన్న విష‌యం ప్ర‌స్తుతం స‌స్పెన్స్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.