కొత్త చిక్కులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-08 12:51:43

కొత్త చిక్కులు

తెలుగుదేశం పార్టీ  క‌ర్నూలు జిల్లాలో ఫిరాయింపుల‌కు పాల్ప‌డి త‌న రాజ‌కీయ పందా చూపించింది.. జ‌గ‌న్ ఫిరాయింపుల చేత రాజీనామాలు చేయించాలి అని కోరినా, చివ‌ర‌కు ఆ ప‌ని చేయ‌లేదు తెలుగుదేశం పార్టీ.. ఇటు నంద్యాల ఉప ఎన్నికల స‌మ‌యంలో వైసీపీ ఓట‌మి పాల‌వ్వడంతో తెలుగుదేశం జిల్లాలో మ‌రింత విమ‌ర్శ‌లు పెంచింది.. అయితే అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి ఓట్లు అటు మ‌ళ్లుతాయి అనేది తెలిసిందే. చివ‌రకు అదే జ‌రిగింది నంద్యాల ఉప ఎన్నిక‌లో.. ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో  రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కుతున్నాయి..
 
ఇటీవ‌ల మ‌హానాడుకు గైర్హాజ‌రైన క‌ర్నూలు జిల్లా బ‌న‌గాన ప‌ల్లి ఎమ్మెల్యే బి.సి జనార్దనరెడ్డి సీఎం చంద్ర‌బాబును క‌లిశారు..ఆయ‌న ఓ కంప్లైంట్ ఇవ్వ‌డానికి సీఎం ను క‌లిశారు అని జ‌ల్లా టీడీపీలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.రాష్ట్ర పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ తీరుపై ఆయ‌న సీఎం చంద్ర‌బాబుకు  ఫిర్యాదుచేసినట్లు సమాచారం..బనగానపల్లె నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన కాటసాని రామిరెడ్డికి మంత్రి ఓ కాంట్రాక్టు పని అప్పగించారని ఫిర్యాదు చేశారు అని తెలుస్తోంది. అయితే దీనికి ఓ రాజ‌కీయం రంగు అద్దారు.. ఆయ‌న కు ప‌నులు అప్ప‌చెప్ప‌డంతో ఆయ‌న త‌న పై ఆ న‌గ‌దుతోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగుతారు అని ఫిర్యాదు చేశార‌ట.
 
అయితే మంత్రి అఖిల ప్రియ ఎందుకు సాయం చేశారు అనేదానికి కార‌ణాలు కూడా చెబుతున్నారు.. కాటసాని రామిరెడ్డి అఖిలప్రియ సోదరుడైన నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి స్వయానా మామ.. దీంతో ఆమె కాంట్రాక్టు ఇచ్చి ఉంటారు అని జిల్లాలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.. మంత్రి వ్య‌వ‌హారంతో ఎమ్మెల్యే కొద్ది రోజులుగా పార్టీ కార్య‌క్ర‌మాలకు దూరంగా ఉంటున్నారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారంపై సీఎం ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.