రాజంపేట బీ.సీ. సభ్యుల ఆత్మీయ సమ్మేళనం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-07-17 16:57:11

రాజంపేట బీ.సీ. సభ్యుల ఆత్మీయ సమ్మేళనం

రాజంపేట పార్లమెంట్ పరిధిలోని రాజంపేట, కోడూరు, రాయచోటి నియోజకవర్గ బీసీ అధ్యయన కమిటీ   రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు,పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది 
 
ఈ సమావేశంలో ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు బాబు నాయుడు ఎన్నికలు ముందు బీసీ లకు హామీలు ఇచ్చి బీసీ లును మోసం చేయడం జరిగింది. బీసీ వర్గాల వారికి అన్నిరకాల మేలు చేసిన వ్యక్తి మన దివంగత వై యస్ రాజశేఖర్ రెడ్డి. బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి మాత్రమే మన జననేత జగన్ మోహన్ రెడ్డి ముందుగానే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అని అధ్యయన కమిటీ వేశారు. జగన్ పాదయాత్ర అనంతరం బీసీ గర్జన పెట్టి బీసీ వర్గాలకు ఏమి చేయబోతారో తెలియజేస్తారు. 
 
మరో ముఖ్య అతిధి రాయచోటి శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ నవరత్న పథకాలను ప్రజలు   స్వాగతిస్తున్నారు. ప్రజలు జగన్  పాదయాత్రలో బ్రహ్నరధం పడుతున్నారు. వైయస్ఆర్ సిపి అధికారం లోకి వస్తే జగన్ చేపట్టబోయే నవరత్న పథకాలను విస్తృతం గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.   
 
రాజంపేట పార్లమెంట్ బిసి సెల్ అధ్యక్షులు పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ, బిసిలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్ప‌డానికి బిసిలు సిద్ధం కావాలి అని పిలిపునిచ్చారు. బిసిలు హైకోర్టు  జడ్జీలుగా  పనికిరారని సమస్యలు  చెప్పుకోవడానికి వెళ్లిన నాయి బ్రాహ్మణ నాయకులను అవమానపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు అసలు రూపాన్ని బిసిలు గ్రహించాలని  కోరారు. 
 
రాజంపేట బిసి సెల్ అధ్యక్షులు గోవిందు బాలకృష్ణ మాట్లాడుతూ, బిసిలను టిడిపి ఓటు బ్యాంకుగానే  చూస్తుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో రూ. 14 వేల కోట్లు పెట్టి వాస్తవానికి రూ. 750 కోట్లు ఖర్చు పెట్టడం లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పోలా శ్రీనువాసులు రెడ్డి, చొప్ప యల్లా రెడ్డి, బీసీనాయకులు, ఈశ్వరయ్య, మూడు నియోజకవర్గా బీసీ నాయకులు పాల్గొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.