ఆ వ‌ర్గం టీడీపీకి దూరం?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-22 13:00:09

ఆ వ‌ర్గం టీడీపీకి దూరం?

వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఏపీలో ఇటు తెలుగుదేశం అటు వైసీపీ, జ‌న‌సేన రెడీ అవుతున్నాయి... అయితే తెలుగుదేశం గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో కాపుల‌ను బీసీల్లో చేరుస్తాను అని హామీ ఇచ్చింది..అయితే ఆ హామీ ఇప్పుడు తెలుగుదేశం నిర్వ‌ర్తించ‌లేదు.దీంతో పార్టీలో కొంద‌రు తెలుగుదేశం నాయ‌కులు  కూడా ఇదే ఆలోచ‌న‌లో ఉన్నారు.... కాపుల‌కు ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ హామీ ఏమైందని వారు ప్ర‌శ్నిస్తున్నారు..
 
అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం తెలుగుదేశం నాయ‌కులు బీసీ-కాపు సామాజికవ‌ర్గాల‌కు స‌మాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు... వీరి ఇద్ద‌రి మ‌ధ్య తెలుగుదేశం నాయ‌కులు ఇరుక్కునే అవ‌కాశం ఉంది అని అంటున్నారు. అయితే రాజ‌కీయంగా పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి తెలుగుదేశం బీసీల‌కు మంచి ప్ర‌యారీటి ఇస్తూ వ‌స్తోంది..సీట్లు ఇవ్వ‌డం అలాగే పార్టీలో ప‌ద‌వులు ఇవ్వ‌డంలో కూడా అంతే ప్ర‌యారీటి ఇస్తూ ఉంటోంది.
 
గ‌త మూడు ద‌శాబ్దాలుగా కాపులు కాంగ్రెస్ కు మద్ద‌తు ఇస్తూ ఉన్నారు... అయితే కాపు రిజ‌ర్వేష‌న్ అంశంలో తెలుగుదేశానికి బీసీలు కూడా కాస్త షాక్ ఇచ్చేలా క‌నిపిస్తున్నాయి ప‌రిణామాలు,ముఖ్యంగా రిజ‌ర్వేష‌న్ల అంశంలో ఓ కులాన్ని మ‌రో కేట‌గిరి నుంచి వేరే కేట‌గిరిలో చేర్చాలి అన్నా తొలిగించాలి అన్నా చాలా పెద్ద ప్రాసెస్... ఇది రాష్ట్ర ప్ర‌భుత్వం చేతుల్లో  ఉండ‌దు..కేంద్రం చేతుల్లో ఉంది.. కేంద్రం అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి.. అయితే ఇప్పుడు కాపుల‌ను బీసీల్లో చేర్చితే మొత్తం కాపులు అందరి ఓట్లు వ‌స్తాయో లేదో తెలియ‌దు కాని, బీసీ ఓట్లు తెలుగుదేశానికి ఒక్క‌టి కూడా మ‌ర‌ల‌దు అనేది ఇప్పుడు తెలుగుదేశం ఆలోచ‌న‌.
 
ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే కాపుల‌ను బీసీల్లో చేరుస్తూ చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంతో పాటు అసెంబ్లీలో ఆమోదం కూడా తీసుకున్నారు కొద్ది నెల‌ల క్రితం...అసెంబ్లీ తీర్మానాన్ని చంద్ర‌బాబు ఢిల్లీకి పంప‌గానే కేంద్ర స‌ద‌రు బిల్లును పెండింగ్ లో పెట్టేసింది. అయితే ఎన్డీయే నుంచి తెలుగుదేశం బ‌య‌ట‌కు రావ‌డంతో ఆ బిల్లు ముందుకు వెళ్లే దారి లేదు. దీంతో చంద్ర‌బాబు వ్యూహం వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెడిసికొడుతుందే అన్న ఆందోళ‌న టిడిపిలో క‌న‌బ‌డుతోంది. మ‌రి చూడాలి వ‌చ్చే రోజుల్లో తెలుగుదేశం ఎటువంటి పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ ఈ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఫాలో అవుతుందో.. అది ఆయా వ‌ర్గాలు ఎలా రిసీవ్ చేసుకుంటాయో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.