బాబుతో జాగ్రత్త...క్యాన్సర్ కన్నా ప్రమాదకరం...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

mudragada
Updated:  2018-04-15 17:08:40

బాబుతో జాగ్రత్త...క్యాన్సర్ కన్నా ప్రమాదకరం...

కాపు రిజర్వేషన్ కోసం చంద్రబాబుకు మూడు చెరువుల నీళ్లు తాగించారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు...అప్పుడప్పుడు టీడీపీ అవినీతిపై  చంద్రబాబుపై నిప్పులు చెరుగుతూ ఘాటుగా లేఖలు రాసేవారు ముద్ర‌గ‌డ‌... అయితే ఇప్పుడు మరోసారి చంద్రబాబుకు లేఖ రాసారు... మీరు మేధావి అని ప్రజలందరం భావించి ఓటు వేశారు..కానీ మీ మేధాసంపతిని ప్రజల కోసం కాకుండా మీ కుటుంబం కోసం, మీరు దోచుకోవడం కోసం ఉపయోగిస్తున్నారని లేఖ‌లో పెర్కొన్నారు. 
 
ఎన్నికల సమయంలో మీరు కాపులకు రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు..కానీ మీరు ఇచ్చిన హామీని మేము నెరవేర్చమని అడిగితె జైల్లో పెట్టించడం, కొట్టించడం చేస్తున్నారు...మేము గట్టిగ నిలదీస్తే మా సామజిక వర్గం వాళ్ళతోనే తిట్టిస్తారు... అధికారం కోసం తప్పుడు హామీలు ఇచ్చి, అవసరం తీరిన తర్వాత మమల్ని మార్చిపోతారా అని లేఖలో పేర్కొన్నారు...  
 
కాపు క్రీడాకారుడు కామన్ వెల్త్ గేమ్ లో రెండు సార్లు స్వర్ణం గెలిస్తే ప్రభుత్వం తరపున కనీసం అభినందనలు కూడా చెప్పలేదు.. మీ సామజిక వర్గానికి చెందిన వాడు కాదని చెప్పలేదా...అదే మీ సామజిక వర్గానికి చెందిన వాడైతే లోకం మొత్తం తెలిసేలా పచ్చ మీడియాతో భజన చేపించే వాళ్ళు కాదా అని లేఖలో విమర్శించారు...మీ కుమారుడికి తెలుగు నేర్పడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు సిగ్గు లేదా...మీరు క్యాన్సర్ కన్నా ప్రమాదం...క్యాన్సర్ వస్తే మందులతో అయినా నయం అవుతుంది...మీరు మోసం చేస్తే దాని నుండి బయటపడటానికి మందులు కూడా లేవు అని ఘాటుగా లేఖలో పేర్కొన్నారు.
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.