పాద‌యాత్రలో తేనెటీగ‌లు దాడి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-07 16:28:10

పాద‌యాత్రలో తేనెటీగ‌లు దాడి

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాంధ్ర‌లోని నాలుగు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నిడుద‌వోలు నియోజ‌కవ‌ర్గంలో నిర్వి రామంగా కొన‌సాగుతోంది.
 
అయితే ఈ పాద‌యాత్ర నిన్న‌టితో 182 రోజుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని నేడు 183 వ రోజులోకి అడుగు పెట్టింది. ఈ రోజు 12 గంట‌ల వ‌ర‌కూ సాఫీగా కొన‌సాగిన పాద‌యాత్ర పెరవలి మండలం కానూరు శివారులోని కొండాలమ్మ గుడి ద‌గ్గ‌ర తేనెటీగ‌లు జ‌గ‌న్ పై దాడి చేశాయి. 
 
అయితే ఈ దాడి నుంచి జ‌గ‌న్ ను కాపాడేందుకు సిబ్బంది బ‌ల‌గాలు అన్ని విధాలా ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా జ‌గ‌న్ పై తేనెటీగ‌లు అటాక్ చేసి ఆయ‌న కుడిచెయ్యి, క‌న్ను, మెడ‌పై బాగా కుట్టేశాయి. ఆయ‌న‌తో పాటు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు కూడా గాయాలు అయ్యాయి. దీంతో వెంట‌నే వారిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
 
అయితే జ‌గ‌న్  మాత్రం చికిత్స‌కు నిరాక‌రించి పాద‌యాత్ర య‌దా విధిగా  కొనసాగిస్తూ త‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన వారిని చక్క‌టి చిరున‌వ్వుతో ఆప్యాయంగా ప‌లుక‌రిస్తూ పాద‌యాత్ర‌లో ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.