బెడిసికొట్టిన బాబు వ్యూహం...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-04-08 11:26:38

బెడిసికొట్టిన బాబు వ్యూహం...

చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి అధికార దాహంతో విలువలని తుంగలో తొక్కి నెరవేర్చలేము అని తెలిసిన  సుమారు 600 పైగా తప్పుడు హామీలను ప్ర‌క‌టించి అధికారంలోకి వచ్చారు... ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రాష్ట్రా ప్రజలను నమ్మించి నట్టేట ముంచారు చంద్రబాబు... ఈ సారి రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కి ఫిరాయింపులను ప్రోత్సహించి సుమారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పిరాయించేలా చేశారు...అప్పటి నుండి ఫిరాయింపు అనే పదం ప్రతిపక్షం నోటా, రాష్ట్ర ప్రజల నోటా వాడుక పదం అయిపొయింది.
 
2014 ఎన్నికలలో చాల మందికి కాంగ్రెస్ నాయకులకు చంద్రబాబు సీట్లు ఇచ్చారు...దీంతో టీడీపీలో సీటు ఆశించిన అసమ్మతి నాయకుల జాబితా పెరిగిపోయింది .. అప్పుడు చంద్రబాబు వారికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తానని చెప్పి బుజ్జగించారు...అయితే ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించిన నేపథ్యంలో ఒక వైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మరో వైపు అసమ్మతి నాయకులు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక బాబు జుట్టుపీకుంటున్నారు.
 
రాష్ట్ర విభజన సమయంలో నియోజకవర్గాల పెంపుతో పాటు విభజన చట్టంలో చాల అంశాలను పొందుపరిచారు......వచ్చే ఎన్నికల్లో విళ్లందరి నుండి అసమ్మతి పెరగకుండా ఉండాలంటే ఉన్న ఏకైక మార్గం నియోజకవర్గాల పెంపు..చంద్రబాబు నాలుగేళ్ళ కాలంలో ప్రత్యేక హోదా లాంటి ఎన్నో అంశాలు ఉన్న 30 సార్లు ఢిల్లీకి వెళ్లి కేవలం నియోజకవర్గాల పెంపు గురించే మాట్లాడారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు గురించి మాట్లాడలేదని విశ్లేష‌కులు తెలుపుతున్నారు.
 
చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ ఉన్న సమయంలో " మోడీ హైదరాబాద్ కి వస్తే అరెస్ట్ చెపిస్తా అని చేసిన వ్యాఖ్యలు " మోడీ గుర్తుపెట్టుకున్నారేమో అందుకే టీడీపీ, బీజేపీతో మిత్ర పక్షంగా ఉన్న కూడా నాలుగేళ్లు గడిచిన విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు...చంద్రబాబు కూడా ఓటుకు నోటు కేసుకు  బయపడి నియోజగవర్గాల పెంపు తప్ప ఏ అంశాన్ని అడిగే దైర్యం చేయలేకపోతున్నాడు...నియోజకవర్గాల పెంపు లేకపోతే పార్టీకి భవిష్యత్తు ఉండదేమో అని ఓటుకు నోటు కేసు ఉన్న 30 సార్లు ఢిల్లీకి వెళ్లి అడిగారు..కానీ అందరికి మొండిచేయి చూపించే బాబుకు మోడీ మొండిచేయి చూపించారు...దీంతో ఫిరాయింపులను ప్రోత్సహించి, నియోజకవర్గాలను పెంచుకొని సీట్లు సర్దుబాటు చేద్దాం అనుకున్న బాబు వ్యూహం బెడిసికొట్టింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.