ఆక్వావ‌రం- భీమ‌వ‌రం వైసీపీదా -టీడీపీదా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-30 16:47:54

ఆక్వావ‌రం- భీమ‌వ‌రం వైసీపీదా -టీడీపీదా

ఆంధ్రా అమెరికా అని పిలుస్తారు భీమ‌వ‌రాన్ని..గోదావ‌రి జిల్లాలో భీమ‌వ‌రం పేరు చెప్ప‌గానే కోడిపందాలే గుర్తువ‌స్తాయి కోడిపందాల‌కే కాదు ఆయ్ రాజ‌కీయాల‌కు కూడా మేమే వీరులం అని చెబుతారు సీనియర్లు.. రాజ‌కీయంగా భీమ‌వ‌రం గురించి చ‌ర్చిస్తే హేమాహేమీలు ఎవ‌రూ ఇక్క‌డ నుంచి పెద్ద పెద్ద ప‌ద‌వులు చేప‌ట్ట‌క‌పోయినా రాజ‌కీయంగా జిల్లాలో పెద్దపేరు తెచ్చుకుంది...ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో రెండోవ పెద్ద ప‌ట్ట‌ణంగా పేరు సాధించుకుంది.
 
2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ త‌ర‌పున పి రామాంజ‌నేయులు ఎమ్మెల్యేగా గెలిచారు.. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న తెలుగుదేశంలో చేరారు.. ఆ స‌మ‌యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండ‌టంతో తెలుగుదేశం ఆయ‌నకే సీటు ఇచ్చింది, 2014 ఎన్నిక‌ల్లో కూడా పి రామాంజ‌నేయులు ఇక్క‌డ విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్ది గ్రంధి శ్రీనివాస‌రావు పై 13726 ఓట్ల‌తో రామాంజ‌నేయులు విజ‌యం సాధించారు.. ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు ఇక్క‌డ గెలుపును  డిసైడ్ చేశాయి అన‌డంలో అతిశ‌యోక్తిలేదు.
 
ఇక్క‌డ‌ గ్రంధి శ్రీనివాస్ 2004 లో కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యే అయ్యారు..2009 లో పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు అంజిబాబుకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. ఇక 2009 లో పాల‌కొల్లుకు భీమ‌వ‌రానికి మ‌ధ్య పెద్ద గ్యాప్ లేక‌పోవ‌డం ఇక్క‌డ చిరంజీవి హవా క‌లిసి రావ‌డం ప‌క్క సెగ్మెంట్ కావ‌డంతో ఇక్క‌డ ఓట‌ర్లు పీఆర్పీపై కాస్త ఆస‌క్తి క‌న‌బ‌ర్చారు.. ఇక ఆ ఎన్నిక‌ల్లో పీఆర్పీ త‌ర‌పున వేగేశ్న సూర్య‌నారాయ‌ణ రాజుకు చిరంజీవి టికెట్ ఇచ్చారు..కాని ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది... అయితే ఇక్క‌డ క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గాన్ని దృష్టిలో పెట్టుకుని గ‌త కాంగ్రెస్ ఫార్మూలా ఫాలో అయింది  పీఆర్పీ, 
 
అయితే అప్ప‌టికే కాంగ్రెస్ త‌ర‌పున ఉన్న పుల‌ప‌ర్తి అంజిబాబుకు విజ‌యం వ‌రించింది ఇక్క‌డ పీఆర్పీ సెకండ్ పొజిష‌న్ లో ఉంటే తెలుగుదేశం మూడ‌వ స్ధానంలో ఉండిపోయింది.. ఇక త‌ర్వాత రామాంజ‌నేయులు తెలుగుదేశంలోకి వెళ్ల‌డంతో ఆయ‌న‌కు సీటు ఇచ్చింది తెలుగుదేశం...ఇటు వైసీపీకి గ్రంధి శ్రీనివాస్ వెళ్ల‌డంతో అక్క‌డ వైసీపీ శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చింది.
 
అయితే గ‌త ఎన్నిక‌ల్లో క్ష‌త్రియ ఓటు బ్యాంకు -కాపు ఓటు బ్యాంకు-  ఇటు బీజేపీ జ‌న‌సేన‌తో తెలుగుదేశం జ‌త‌క‌ట్ట‌డంతో తెలుగుదేశానికి ప్ల‌స్ అయ్యాయి... ఇటు బీజేపీ త‌ర‌పున నర‌సాపురం పార్ల‌మెంట్ స్ధానం భీమ‌వ‌రం సెగ్మెంట్ కు వ‌స్తుంది ఆ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఇక్క‌డ ప్ల‌స్ అయింది....13 వేల మెజార్టీ తెలుగుదేశానికి ఇక్క‌డ వ‌చ్చింది వైసీపీ పై.
 
అయితే ఇప్పుడు ప‌రిస్దితి మారింది అనే చెప్పాలి, భీమ‌వ‌రం ఎమ్మెల్యే రామాంజ‌నేయలు మృదుస్వ‌భావి అలాగే ఆయ‌న పై ఆరోప‌ణ‌లు లేవు... ఆయ‌న‌ను జిల్లాలో బాబు ప్ర‌ధమ‌స్ధానంలో నిలుపుతున్నారు, కాని కేడ‌ర్ పై అవినీతి ఆరోప‌ణులు వస్తున్నాయి.. అయితే మున్సిపాల్టీ త‌ర‌పున భీమ‌వ‌రంలో అభివృద్ది జ‌రుగ‌డం లేదు అని విమ‌ర్శ‌లు ఉన్నాయి..
 
ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేదు అనే అప‌కీర్తి వ‌స్తోంది. ముఖ్యంగా ఆక్వా పార్కు వివాదానికి ఇటు ఎమ్మెల్యేల పాత్ర‌ల‌తో ఇక్క‌డ అభియోగాలు వస్తున్నాయి. ఇటు ఆక్వారంగానికి ఎమ్మెల్యే ఎటువంటి సాయం చేయ‌డం లేద‌ని దేశంలో పేరుఉన్న భీమ‌వ‌రానికి ప‌ర్యాట‌క శాఖ నుంచి ఎటువంటి కొత్తప్రాజెక్టులు తీసుకురావ‌డం లేద‌ని, టూరిజానికి ఎంతో అవ‌కాశం ఉన్నా ఇక్క‌డ అల‌స‌త్వం క‌నిపిస్తోంది అనే విమర్శ‌లు వ‌స్తున్నాయి... అయితే ఓ సారి ఎమ్మెల్యే అయ్యి సుమారు 10 ఏళ్లు అధికారానికి దూరంగాఉన్న గ్రంధి శ్రీనివాస్ కు మ‌ద్ద‌తు ఇప్పుడు ఇక్క‌డ భారీగా పెరుగుతోంది..
 
ఇక రోడ్ల విస్త‌ర‌ణ, ట్రాఫిక్ క‌ష్టాలు ప్ర‌జ‌ల‌కు త‌ప్ప‌డం లేదని అంటున్నారు ప్ర‌జ‌లు.. అయితే తెలుగుదేశం పై కూడా ఇక్క‌డ ప్ర‌జ‌ల్లో పార్టీ త‌ర‌పున వ్య‌తిరేక‌త వ‌స్తోంది... అంజిబాబుపై వ్య‌తిరేక‌త కాక‌పోయినా ఇక్క‌డ పార్టీ పై వ్య‌తిరేక‌త తెలుగుదేశం త‌ర‌పున ఎవ‌రు నిలుచున్నా గెలుపు క‌ష్టం అంటున్నారు... అదే స‌మ‌యంలో గ్రంధిశ్రీనివాస్ కు పార్టీ త‌ర‌పున ఇక్క‌డ మ‌ద్ద‌తు పెరుగుతోంది... ఇక్క‌డ యువ‌త కూడా వైసీపీ పెద్ద ఎత్తున స‌పోర్ట్ నిల‌వ‌డం జ‌రుగుతోంది. ఇటు వైసీపీ త‌ర‌పున జ‌గ‌న్, గ్రంధిశ్రీనివాస్ ను నిల‌బ‌ట్ట‌డం ఖాయమ‌ని కాస్త గ్రామాల్లో మ‌రింత వైసీపీ వెళితే ఇక్క‌డ వైసీపీ 25 వేల మెజార్టీతో విజ‌యం సాధించ‌చ్చు అని తెలుస్తోంది.
 
రిపోర్టుల ప్ర‌కారం పార్టీల బ‌లాలు  భీమ‌వ‌రం సెగ్మెంట్లో 
 
వైసీపీ 50
తెలుగుదేశం 40 
జ‌న‌సేన 10
 
విశ్లేష‌ణ !! గ‌ణేష్ .వి

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.