లారీ నిండ‌ పెళ్లి కార్డులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

bhuma akhila priya
Updated:  2018-08-23 11:34:05

లారీ నిండ‌ పెళ్లి కార్డులు

ఏపీ తెలుగుదేశం పార్టీ పర్యాట‌క శాఖ‌ మంత్రి భూమా అఖిల ప్రియ ఈ నెల 29వ తేదిన వివాహం చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. అయితే అందుకోసం మంత్రి అఖిల ప్రియ అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. నాన్న, అమ్మ బంధువుల‌కు అలాగే రాజ‌కీయ నాయ‌కులకు, పారిశ్రామిక వేత్త‌ల‌కు ఇప్ప‌టికే వెడ్డింగ్ కార్డుల‌ను స్వ‌యంగా ఇచ్చి వ‌చ్చారు. 
 
అయితే గ‌త వారం క్రింద అఖిల ప్రియ పెళ్లికి సంబంధించి లారీ నిండ ఆహ్వాన ప‌త్రిక‌లు ఆళ్ల‌గ‌డ్డ‌కు చేరుకున్నాయి. ఈ ప‌త్రిక‌ల‌న్ని త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అలాగే నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లకు అంద‌జేయ‌నున్నారు. వివాహానికి కేవ‌లం కొన్నిరోజులు మాత్ర‌మే ఉండ‌టంతో ఆహ్వాన ప్ర‌తిక‌లు వీలైనంత త్వ‌ర‌లో పూర్తి చేయ‌నున్నారు అఖిల ప్రియ‌. ఆగష్టు 29వ తేదీన ఆళ్లగడ్డలోని భూమా శోభా నాగిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జ‌రుగ‌నున్న ఈ వివాహానికి సుమారు 30 వేల మంది హాజ‌రు అవుతార‌ని కుటుంబ స‌భ్యులు అంచ‌నా వేస్తున్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వీఐపీలు, వీవీపీలు, రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌ముఖులు హాజ‌రు కానున్న నేప‌థ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్ల‌ను చేయ‌నున్నారు. అయితే ఈ ఏర్పాట్ల‌కు సంబంధించి గోవా నుంచి ఈవెంట్ మేనేజ్ మెంట్ ప్ర‌త్యేక బృందం ఇప్ప‌టికే ఆళ్ల‌గ‌డ్డ‌కు చేరుకుంది. మరోవైపు భూమా అఖిలప్రియ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లను ఆమె మేనమామ ఎస్వీ మోహాన్ రెడ్డి, తాత, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.