ఏవీకి తేల్చి చెప్పిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-10 13:09:50

ఏవీకి తేల్చి చెప్పిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి

ధ‌న‌మేరా అన్నింటికి మూలం అని ఏవీ సుబ్బారెడ్డిని మంత్రి అఖిల ప్రియ పీచుపుల్ల‌లా తీసి వేస్తోంది. భూమా నాగిరెడ్డి ఉంటే నాకీ ప‌రిస్దితి వ‌చ్చేదా ప్ర‌జ‌లారా అనే స్ధాయికి ఏవీని తీసుకువెళ్లింది మంత్రి అఖిల ప్రియ‌.... గుంట‌న‌క్క‌లు అంటూ ప‌రోక్ష సంభోద‌న‌ల‌పై కూడా ఏవీ మండిప‌డ్డారు.. అయితే రాజ‌కీయం అంటేనే అంత సొంత అన్న‌ద‌మ్ముల మ‌ధ్యే చిచ్చు పెడుతుంది.. అలాంటిది స్నేహితుడి కుమార్తెకి ఏవీకి కూడా అలాగే పెట్టింది.
 
నంద్యాల ఆళ్ల‌గ‌డ్డ ఇరువ‌ర్గాలుగా విడిపోయి రాజ‌కీయం జ‌రుగుతోంది... ప్ర‌తిప‌క్షంతో ఎక్క‌డైనా వైరాలు ఉంటాయి కాని సొంత ప‌క్షంలోనే వైరాలు పీక్ స్టేజ్ కు వ‌చ్చాయి వీరి ఇరువురి స్దాయిల‌లో.. తాజాగా మంత్రి  భూమా అఖిలప్రియకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయకూడదని ఏవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారు... ఆయన ఆదేశాల నేపథ్యంలో నంద్యాల సిటీ కేబుల్‌లో మంత్రి వార్తలతో పాటు నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కార్యక్రమాలను కూడా ప్రసారం చేయడం లేదు... వీరి వార్త‌ల ప్ర‌చారానికి  ఇటు నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగానపల్లె ప్రాంతాల్లో బ్రేక ప‌డింది.
  
అయితే.. సిటీకేబుల్‌లో తమకూ వాటా ఉందని, తమ వార్తలను ఎందుకు ప్రసారం చేయరంటూ కేబుల్‌ సిబ్బందిని మంత్రి అఖిలప్రియ హెచ్చరించారు.... ఏ విషయమైనా ఏవీతోనే తేల్చుకోవాలని వారు స్పష్టం చేశారు... ఏవీతో మాట్లాడాల‌ని వారు తెలియ‌చేస్తే తాను మాట్లాడే ప్ర‌స‌క్తేలేద‌ని భీష్మించుకున్నారు అఖిల‌.... వీరి ఇద్ద‌రి వార్త‌లు లేకుండా వారం రోజులుగా కేబుల్ టీవీ ప్ర‌సారం న‌డుస్తోంది.
 
భూమా ఫ్యామిలీ వార్త‌లు లేకుండా ప్ర‌సారాలు జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి... అయితే సోద‌రి వార్త‌ల‌ను  ప్ర‌చారం చేయాలి అని బ్ర‌హ్మానంద‌రెడ్డి కోరినా నీ వార్త‌లు మాత్ర‌మే ప్ర‌చారం చేస్తామ‌ని ఏవీ తెలియ‌చేశార‌ట... అయితే నా వార్త‌లు కూడా వ‌ద్దు అని తేల్చిచెప్పార‌ట ఎమ్మెల్యే బ్ర‌హ్మానంద‌రెడ్డి...ఎంత కాలం ఇలా చేస్తారో చూస్తాం అని బ్ర‌హ్మానంద‌రెడ్డి అన్న‌ట్లు తెలుస్తోంది..
 
ఈ విష‌యం పై జిల్లా మంత్రితో పాటు ముఖ్య‌మంత్రి వ‌ద్ద పంచాయ‌తీ పెట్టించాల‌ని చూస్తున్నార‌ట... 50 శాతం వాటా ఉన్న‌మాకు ఎందుకు హ‌క్కు ఉండ‌దు అని అఖిల వాదిస్తున్నారు అని తెలుస్తోంది... ఈపంచాయ‌తీ మంత్రి లోకేష్ కాకుండా సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళ్ళ‌నుంది అని నంద్యాల‌లో చ‌ర్చించుకుంటున్నారు పార్టీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.