భూమా మౌనిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-27 14:38:14

భూమా మౌనిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆళ్ల‌గ‌డ్డ పంచాయ‌తీ మాములుగా తేలేలా క‌నిపించ‌డం లేదు... స‌మ‌యం లేదు రేపు మాట్లాడదాము అని సీఎం చంద్ర‌బాబు, మంత్రి అఖిల‌ప్రియ‌ను ఏవీసుబ్బారెడ్డిని పంపించిన విష‌యం తెలిసిందే... ఇక నేడు ఈ ఆళ్ల‌గ‌డ్డ పంచాయ‌తీ పై తుది తీర్పు వ‌చ్చే అవ‌కాశం ఉంది... ఒక‌రికి ఫేవ‌ర్ గా తీర్పు వ‌చ్చినా ఎవ‌రో ఒక‌రు పార్టీ వీడ‌టానికి  రెడీ అవుతారు అని తెలుస్తోంది....ఇటు అఖిల విష‌యంలో ఎటువంటి క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నా భూమా కేడ‌ర్ మొత్తం నంద్యాల క‌ర్నూలు ఆళ్ల‌గ‌డ్డ‌లో టీడీపీకి  దూరం అవుతుంది అని, అందుకే భూమా అఖిల‌కు కాస్త బాబు స‌పోర్ట్ ఉంటుంది అని అంటున్నారు.
 
ఇక ఈ పొలిటిక‌ల్ వార్ కాస్త ఫ్యామిలీ వార్ అయిపోతోంది... ఏవీ కుమార్తెలు కూడా మీడియా ముందు భూమా అఖిల ప్రియ‌పై ఫైర్ అయ్యారు.. త‌న తండ్రికి ఏం జ‌రిగినా బాధ్య‌త మీరు తీసుకుంటారా అని ప్ర‌శ్నించారు... రాళ్ల దాడి త‌ర్వాత‌.. ఇక ఇప్పుడు మంత్రి అఖిల సోద‌రి భూమా నాగమౌనికా రెడ్డి  కూడా ఏవీ సుబ్బారెడ్డి  పై ఫైర్ అయ్యారు...
 
నాన్న చనిపోయాక చిన్న పిల్లలమైన మేము ఎంతో సహనంతో ఉన్నాం. ఏవీ సుబ్బారెడ్డి చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన పిల్లలు, మేము కలిసే పెరిగాం. నాన్న చనిపోయాక ఏవీ సుబ్బారెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నాడు. అఖిలప్రియ అంటే భూమా అఖిల ప్రియ అని ఏవీ మరిచిపోతున్నాడు. ఏవీ సుబ్బారెడ్డి రాజకీయంగా ఎదగాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. భూమా అఖిలప్రియ, భూమా కుటుంబంపై వేలెత్తి చూపితే సహించేది లేదు అని ఆమె ఘాటుగా స్పందించారు
 
సీఎం మాకు అండ‌గా ఉంటాం అని చెప్పారు.. సీఎం పై మాకు న‌మ్మ‌కం ఉంది. మా అక్క‌ని వెలెత్తి చూపితే స‌హించేంది లేదు అని ఆమె తెలియ‌చేశారు. ప్రస్తుతం నేను ఏడు నెలల గర్బిణిని. మా కుటుంబాన్ని మీడియా, ప్రజల్లో చులకన చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేక బయటికొచ్చి మాట్లాడుతున్నానని అన్నారు భూమా మౌనికా రెడ్డి. నీ స్కెచ్ తోనే మా నాన్న ముందుకు వెళ్లారు అంటున్నావు మ‌రి నువ్వు నంద్యాల‌లో ఎందుకు ఓడిపోయావు అని ప్ర‌శ్నించారు ఆమె.
 
మా అక్క భూమా అఖిలప్రియ భూమా నాగిరెడ్డి కూతురు, ఎస్వీ సుబ్బారెడ్డి మనవరాలు, ఎస్వీ మోహన్‌రెడ్డి మేనకోడలు. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి చెల్లెలు.. అనే విషయాన్ని మరిచిపోకూడదు. అఖిలను టచ్‌ చేయాలంటే ముందుగా భూమా కుటుంబాన్ని టచ్‌ చేయాల్సి ఉంటుంది అని తీవ్రంగా మాట్లాడారు. మొత్తానికి పొలిటిక‌ల్ వార్ కు చంద్ర‌బాబు ఫుల్ స్టాప్ పెడితే ఈ ఫ్యామిలీ వార్ ను ఎవ‌రు త‌గ్గిస్తారో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.