అందుకే బాబు బయపడుతున్నారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-22 15:07:07

అందుకే బాబు బయపడుతున్నారు

టీటీడీ లో జరుగుతున్న అవకతవకలపై తిరుమల ప్రధాన అర్చకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు...టీడీపీ నాయకులు టీటీడీని బ్రష్టుపట్టిస్తున్నారని, దేవుని నగలను కూడా వదలడం లేదని ఆరోపించారు...తిరుమలలో కనిపించని పింక్ వజ్రం, ఇటీవలే జెనీవాలో వేలం వేసిన పింక్ వజ్రం ఒకటేలా ఉన్నాయని రమణ దీక్షితులు ఆరోపించారు...టీటీడీలో జరిగిన అవకతవకలపై స్పందించిన రమణ దీక్షితులుపై ఉక్కుపాదం మోపుతున్నారు టీడీపీ నాయకులు...
 
అయినప్పటికీ స్వామి వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేనని ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారు...టీటీడీలో జరుగుతున్న‌ అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆయన...దేశ రాజధాని ఢిల్లీలో తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు నిరాహారదీక్ష చేయడానికి సిద్దమైనట్లు సమాచారం.ఈ విషయాన్ని ఇప్పటికే తన స్నేహితులకి తెలియజేసినట్లు సమాచారం...ఈ దీక్షతో  దేశం మొత్తం టీటీడీ వైపు చూడ‌టం ఖాయం.
 
రమణ దీక్షితులుకు మద్దతుగా, ఆయనపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి...టీటీడీలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని ప్రధాన ఆర్చుకులు అడిగితే, విచారణ చేపించాల్సింది పొయ్యి, ఆయనపై ఎదురుదాడికి దిగడం సమంజసం కాదని అన్నారు భూమన.. మీరు ఏ తప్పు చేయక‌పోతే విచారణ జరిపించాడనికి ఎందుకు భయపడుతున్నారని అన్నారు. టీటీడీలో న్యాయబద్దంగా, నిజాయితీగా విచారణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు భూమన కరుణాకర్ రెడ్డి...
 
చంద్రబాబు కులాల మధ్య పెట్టిన చిచ్చు మాదిరిగానే, అర్చకుల కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. వారసత్వ అర్చకత్వం ఎన్నో ఏళ్ల నుంచి అమలుఅవుతుంది. ఎన్నో ఏళ్లుగా వచ్చే ఆచారాన్ని తొలగించే అధికారం మీకు ఎవరిచ్చారని అన్నారు.. రమణ దీక్షితులు టీటీడీలో ఏం జరుగుతుందో మొత్తం బీజేపీ అధ్యక్షులు అమిత్ షాకి చెప్పడం వల్లే ఆయనపై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, రమణ దీక్షితులు కి మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు భూమన.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.