వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అజెండా అదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-01 15:14:06

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అజెండా అదే

2014లో అధికారంలోకి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో ప్ర‌తీ ఒక్క‌రిని మోసం చేశార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి స్ఫ‌ష్టం చేశారు. ఇటీవ‌ల‌ కాలంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ప‌ద‌వీ విర‌మ‌ణ పేరుతో ముగ్గురు ప్ర‌ధాన అర్చ‌కుల‌ను టీడీపీ అధిష్టానం తొల‌గించింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వ‌త ప‌ద‌వుల నుంచి తొల‌గించిన వారిని తిరిగి వారి విధుల్లో తీసుకోవ‌డ‌మే త‌మ అజెండా అని భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. తిరుప‌తిలో ర‌మ‌ణ‌ దీక్షుతుల‌తో స‌మావేశం అయిన ఆయ‌న‌ సుమారు గంట‌సేపు టీటీడీలో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను తెలుసుకున్నారు.ఆ త‌ర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ గ‌తంలో ఎన్న‌డు లేని విధంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హ‌యాంలో అర్చ‌కుల‌కు ప‌ద‌వి విర‌మ‌ణ‌ పెట్టార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
అయితే తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలోని అర్చ‌కుల‌కు ప‌ద‌వి విర‌మ‌ణ లేకుండా చేస్తామ‌ని క‌రుణాక‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. టీటీడీ బోర్డ్ ప‌లు నిర్ణ‌యాల‌ను అక్ర‌మంగా తీసుకుంటుంద‌ని చెప్పిన ఆయ‌న ర‌మ‌ణ‌ దీక్షితుల‌ను తొల‌గించ‌డం భాదాక‌రం అని అయ‌న అన్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.