ఇది బాబు నైజం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-09 13:13:46

ఇది బాబు నైజం

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నాలుగు సంవ‌త్స‌రాలు కేంద్రంతో మిత్ర‌ప‌క్షం వ్య‌వ‌హ‌రించి గతంలో ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజికి జై కొట్టార‌ని భుమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. గుంటూరు జిల్లాలో వైసీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ గతంలో ముఖ్యంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదా అంశాన్ని రాష్ట్రంలో ఎవ‌రైనా ప్ర‌స్తావించినా దీక్ష‌లు, ధ‌ర్నాలు చేసినా వారిపై అక్ర‌మ కేసులు పెట్టించార‌ని భూమ‌న మండిప‌డ్డారు. 
 
అంతేకాదు ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజి కింద ఎక్కువ నిధులు వ‌స్తాయ‌ని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించిన త‌రుణంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అర్థరాత్రి స‌మ‌యంలో హూటా హూటీన మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ధ‌న్య‌వాద‌లు తెలిపార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబు ఎప్పుడు అయితే ప్ర‌త్యేక హోదాకు ధ‌న్య‌వాదులు తెలిపారో అప్ప‌టి నుంచి ప్యాకేజికి వ్య‌తిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌ప్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక హోదా కావాలంటూ దీక్ష‌లు చేస్తూ మ‌రో వైపు ప్ర‌జ‌ల‌ను చైత‌న్యవంతుల‌ను చేశార‌ని భూమ‌న కరుణాక‌ర్ రెడ్డి గుర్తు చేశారు. 
 
అంతేకాదు హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలతో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయించి కేంద్రానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టించార‌ని ఆయ‌న తెలిపారు. ఇప్పుడు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఉద్యోగాలు ప‌రిశ్రమ‌లు వ‌స్తాయ‌ని ప్ర‌జ‌ల‌కు అవ‌గాహన రావ‌డంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు యూట‌ర్న్ తీసుకున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభ‌వ‌గ్నుడ‌ని చెప్పుకుని ప్ర‌చారం చేసుకునే ముఖ్య‌మంత్రి గతంలో వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెడితే రాష్ట్రానికి ఎటువంటి ఉప‌యోగం లేద‌ని మాట్లాడార‌ని భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు.
 
అలాగే గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో సుమారు ఆరువంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చార‌ని అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒక్క హామీను పూర్తిగా అమ‌లు చెయ్య‌లేద‌ని ఆయ‌న తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. అవ‌స‌రాల‌ను బట్టి మాట మార్చ‌డం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నైజం అని ఆయ‌న అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.