బాబు రెండు నాలుక‌ల ధోర‌ణి బ‌ట్ట‌బ‌యలు వైసీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp
Updated:  2018-09-03 02:36:26

బాబు రెండు నాలుక‌ల ధోర‌ణి బ‌ట్ట‌బ‌యలు వైసీపీ

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో స్వామి వారికి త‌మ అన‌ణ్య‌మైన‌టువంటి భ‌క్తి విశ్వాసాల‌ను చాటుకున్న మ‌నుషుల‌కు ఈ ప్ర‌భుత్వంలో హ‌క్కులేదని, అలాగే దేవుడికి కూడా దిక్కులేద‌ని ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమ‌న కరుణాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, టీటీడీ న‌గ‌లు, దుర్గ‌మ్మ చీర‌లు, మ‌ల్ల‌న్న మ‌ని మాణిఖ్యాలు  అధికార ప‌చ్చ‌రాబ‌ళ్ల జోబుల్లోకి ప‌ల‌హారాలుగు మారుతున్నాయ‌ని ఆయన ఆరోపించారు. 
 
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎంతో ప‌విత్ర‌మైన స్వామివారి ఆల‌యానికి అప్ర‌తిష్ట‌త జ‌రుగుతోంద‌ని భూమ‌న‌ ఆరోపించారు. టీటీడీకి శ్రీకృష్ణ దేవ‌రాయులు ఇచ్చిన న‌గ‌లు ఏమ‌య్యాయి. గ‌తంలో ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు దేవాల‌యంలో స్వామి వారి న‌గ‌లు పోయాయని ఫిర్యాదు చేసిన‌ప్పుడు వైసీపీ నాయ‌కులు వ్య‌తిరేకిస్తే తామే ఆ న‌గ‌లు దొంగ‌లించామ‌ని చెప్పార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు స్వామివారి న‌గ‌లు పోయాయి అంటే త‌న‌పై సీబీఐ ఎంక్వైరీ వెయ్యాల‌ని సాక్షాత్తు గ‌ర్న‌ర్ ను కోరార‌ని అయితే ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వెయ్య‌కుడంలేద‌ని భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు.

షేర్ :