చంద్ర‌బాబు ప్లాష్ బ్యాక్ పై భూమ‌న సంచ‌ల‌న సీక్రెట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

bhumana  reveals on  chandrababu  secrets
Updated:  2018-03-02 12:25:35

చంద్ర‌బాబు ప్లాష్ బ్యాక్ పై భూమ‌న సంచ‌ల‌న సీక్రెట్

ప్ర‌పంచ‌మేటి రాజ‌ధానిలో మాప్రాంతం భాగంగా లేదు కాబ‌ట్టి మాకు రాయ‌ల‌సీమ‌లో హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని కోరుతున్న రాయ‌ల‌సీమ వాదుల‌పై, సీఎం వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీలో వైర‌ల్ అవుతున్నాయి.. ఊరికో హైకోర్ట్ కావాలా దిస్ ఈస్ నాట్ స‌రైన ప‌ద్ద‌తి అంటూ ఆయ‌న మీడియాలో తెలియ‌చేశారు. 40 వ‌సంతాల రాజ‌కీయ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆశ్చ‌ర్య‌క‌మైన వ్యాఖ్య‌లు - స‌మాధానాలు చెప్పారు సీఎం చంద్రబాబు.. ఏకంగా దివంగ‌త సీఎం రాజ‌శేఖ‌ర్ రెడ్డికి కూడా తానే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాను అని చెప్ప‌డం కూడా వైర‌ల్ అయింది.
 
ఇక దీనిపై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సినియ‌ర్ నేత కౌంట‌ర్ ఇచ్చారు... అస‌లు త‌మ జిల్లాలో చంద్ర‌బాబు చ‌రిత్ర ప్ర‌తీ ఒక్కరికీ  తెలుసు అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు... నాకు చంద్రబాబు రాజ‌కీయం అంతా తెలుసు అని చంద్రబాబు కంటే రాజ‌కీయాల్లో తాను నాలుగు సంవ‌త్స‌రాలు జూనియ‌ర్ అని ఆయ‌న తెలిపారు.
 
ఇక చంద్రబాబు స్టోరీని తెలియ‌చేశారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి...1974 లో తిరుప‌తిలో  ఎస్వీ యూనివర్శిటీలో ఆర్‌ఎస్‌యూనియన్ ను ప్రారంభించామని తెలిపారు.. ఆ స‌మ‌యంలో దానిని విధాన ప‌రంగా న‌డ‌ప‌డం కోసం, ఆ ఏడాది డిసెంబ‌ర్ 8 వ తేదిన ఓ సినిమాని ప్రారంభ‌షోగా ప్ర‌ద‌ర్శించాలి అని అనుకున్నాం.. అప్పుడు  సినిమా టికెట్ ధ‌ర రెండు రుపాయ‌లకు విక్ర‌యించాలి అని భావించాం. ఇక ఆ స‌మ‌యంలో చంద్రబాబుని టికెట్ కొన‌మ‌ని అడిగితే రెండు రూపాయ‌లు నిద్ర‌పోతున్న త‌న స్నేహితుడి జేబులోంచి తీసి ఇచ్చాడు.. ఇది చంద్ర‌బాబు క్యారెక్ట‌ర్ అని ఆయ‌న విమ‌ర్శించారు.
 
అలాగే ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా  చంద్ర‌బాబు క‌కృత్తి ప‌నులు మాన‌లేదు అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.. 1977 లో చంద్ర‌గిరిలో చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ గా ఉన్నారు, ఆ స‌మ‌యంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో రాజ‌గోపాల్ నాయుడు ఎంపీగా నిల‌బ‌డ్డారు. ఇక ప్ర‌చారం కోసం చంద్ర‌బాబుకు 200 లీట‌ర్ల పెట్రోల్ ఇస్తే ఆ పెట్రోల్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ నేత వీర రాఘవులు నాయుడికి చెందిన బంకులో అమ్మేశారని కరుణాకర్ రెడ్డి వివరించారు..
 
ఇలాంటి వ్య‌క్తి రాజ‌కీయాల గురించి మాట్లాడ‌తారా అంటూ ఫైర్ అయ్యారు క‌రుణాకర్ రెడ్డి... చ‌రిత్ర‌కు ఎన్న‌డూ చెద‌ప‌ట్ట‌ద‌ని ఎవ‌రో ఒక‌రి ద్వారా నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తామ‌ని అన్నారు. ఈ విష‌యం ఎవ‌రో చెప్పింది కాద‌ని, కాంగ్రెస్  నాయ‌కుడు వీర రాఘవులు నాయుడే స్వయంగా చెప్పారన్నారు.. ఇలాంటి చంద్రబాబు - రాజ‌శేఖ‌ర్ రెడ్డి గురించి మాట్లాడే సాహసం చేయ‌కూడ‌దు అని అన్నారు ఆయ‌న‌.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.