ష‌ర్మిల పాత్రకు ఆ హీరోయినే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-25 18:04:57

ష‌ర్మిల పాత్రకు ఆ హీరోయినే

గ‌త‌ కొద్ది కాలంగా ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోను బ‌యోపిక్ ల హవా ఏ రేంజ్ లో కొన‌సాగుతుందో మ‌నంద‌రికీ తెలిసిందే.. అయితే ఇప్ప‌టికే దివంగ‌త నేత న‌టుడు నంద‌మూరి తార‌కరామారావు జీవితక‌థ ఆధారంగా చేసుకుని విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సినిమా తెర‌కెక్కించ‌నున్నారు..
 
ఈ సినిమాకు సంబంధించి ల‌క్ష్మిస్ ఎన్టీఆర్ అనే టైటిల్ కూడా చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది..ఇక మ‌రో ద‌ర్శకుడు తేజ కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నారు ఈ  సినిమాలో నంద‌మూరి బాల‌కృష్ణ త‌న తండ్రి పాత్ర‌లో న‌టించ‌నున్నారు.
 
అయితే ఈ క్ర‌మంలోనే దివంగ‌త నేత, కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రి, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి  బ‌యోపిక్ ను యాత్ర అనే టైటిల్ తో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే...ఈ చిత్రానికి వి.రాఘవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ సినిమాలో వైఎస్ ప్ర‌ధాన పాత్ర‌లో మ‌ళ‌యాల న‌టుడు ముమ్మ‌ట్టి, విజ‌య‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార న‌టిస్తున్నారు. ఇక‌ వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌లో హీరో సూర్య న‌టిస్తున్నార‌ని టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. 
 
ఇక తాజాగా వైఎస్ ష‌ర్మిల పాత్ర‌లో హీరోయిన్ భూమిక న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈమె నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన ఎమ్ సీఏ సినిమాలో న‌టించారు ఈ చిత్రంలో నానికి  వ‌దిన పాత్ర‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇక ష‌ర్మిల పాత్ర‌కు భూమిక అయితే క‌రెక్ట్ గా స‌రిపోతుంద‌ని భావించి చిత్ర యూనిట్ ఆమెను సెల‌క్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.